Share News

JAC: ఏపీ ఉద్యోగ జేఏసీ తాలుకా ఎన్నికలు ఏకగ్రీవం

ABN , Publish Date - Apr 16 , 2026 | 11:53 PM

పట్టణంలోని ఏపీ ఎన్జీవో హోమ్‌లో గురువారం జిల్లా ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు జె. మాధవ, ప్రధాన కార్యదర్శి ఎ. రవికుమార్‌, ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కార్య దర్శి జీ పాతిరెడ్డి, ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి ఆధ్వ ర్యంలో కళ్యాణదుర్గం, కంబదూరు, కణేకల్లు జేఏసీ ఎన్నికలు నిర్వ హించారు.

JAC: ఏపీ ఉద్యోగ జేఏసీ తాలుకా ఎన్నికలు ఏకగ్రీవం
New committee members

కళ్యాణదుర్గం ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఏపీ ఎన్జీవో హోమ్‌లో గురువారం జిల్లా ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు జె. మాధవ, ప్రధాన కార్యదర్శి ఎ. రవికుమార్‌, ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కార్య దర్శి జీ పాతిరెడ్డి, ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి ఆధ్వ ర్యంలో కళ్యాణదుర్గం, కంబదూరు, కణేకల్లు జేఏసీ ఎన్నికలు నిర్వ హించారు. కళ్యాణదుర్గం తాలూకా జేఏసీ ఛైర్మనగా ఎస్‌ తిరు పాలయ్య, జనరల్‌ సెక్రెటరీగా ఎం. గణేష్‌, కంబదూరు జేఏసీ చైర్మనగా జి ఉమామహేష్‌, జనరల్‌ సెక్రెటరీగా టి. రియాజ్‌ మహ మ్మద్‌, కణేకల్లు జేఏసీ చైర్మనగా సోమశేఖర్‌, జనరల్‌ సెక్రెటరీ గా జగదీష్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరితో పాటు ప్రతి తాలు కాకు ముగ్గురు ఉపాధ్యక్షులు, ముగ్గురు జాయింట్‌ సెక్రెటరీలు ఎని మిది మంది ఈసీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈశ్వరయ్య, ఏపీటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసనాయక్‌, ఏపీటీఎఫ్‌ మాజీ అధ్యక్షుడు వెంకటే శులు పెన్షనర్ల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తిప్పేస్వామి, మల్లికార్జున సచివాలయ సిబ్బంది, ఆర్టీసీ సిబ్బంది, ఉపాధ్యాయ సంఘం నాయకులు, ఉద్యోగులు, పెన్షనర్లు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Apr 16 , 2026 | 11:54 PM