Share News

MLA: టీడీపీని అప్రతిష్ట పాల్జేసే యత్నం

ABN , Publish Date - Jun 26 , 2026 | 11:46 PM

టీడీపీని అప్రతిష్టపాలు చేయటానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహిం చిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివిధ పార్టీల ముసుగులో ఉన్న కొంతమంది టీడీపీకి ఇబ్బంది కలిగించే ప్రయత్నాలు చేస్తున్నాయ ని, వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాలన్నారు.

MLA: టీడీపీని అప్రతిష్ట పాల్జేసే యత్నం
MLA Kalava is speaking

- టీడీపీ నాయకుల సమావేశంలో ఎమ్మెల్యే కాలవ

రాయదుర్గం, జూన 26(ఆంధ్రజ్యోతి): టీడీపీని అప్రతిష్టపాలు చేయటానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహిం చిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివిధ పార్టీల ముసుగులో ఉన్న కొంతమంది టీడీపీకి ఇబ్బంది కలిగించే ప్రయత్నాలు చేస్తున్నాయ ని, వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాలన్నారు. పట్టణంలో ఇటీవల కళ్యాణదుర్గం ప్రాంతానికి చెందిన ఓ టీడీపీ నాయకుడిపై జరిగిన దాడిని ఆయన ఈ సందర్భంగా ఉదాహరించారు. తనకు, తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం సంబంధం లేని ఈ దాడిని కొందరు స్థానిక బీజేపీ, వైసీపీ, కాంగ్రెస్‌ నాయకులు కలిసికట్టుగా తమకు అంటగట్టే యత్నం చేస్తున్నారని విమర్శించారు. ముందు నుంచి బీజేపీలో ఉన్న నాయకు లతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. వేరే పార్టీలో ఉంటూ అక్ర మాలకు పాల్పడి, ఇటీవల కాలంలో బీజేపీలో చేరిన వారితోనే సమస్య అన్నారు. ఇలాంటివారి రాజకీయ కుట్రలను గుర్తించి, ఎప్పటికపుడు తిప్పి కొట్టాలని స్థానిక నాయకులకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు 2029 ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకుని ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో బలంగా పనిచేయాలన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 26 , 2026 | 11:46 PM