MLA: త్వరలో అమృత - 2 పనులు ప్రారంభం
ABN , Publish Date - Jun 08 , 2026 | 11:34 PM
అమృత - 2 పథకం కింద రూ. 78 కోట్ల వ్యయంతో చేపట్టనున్న తాగునీటి ప్రాజెక్టు పనులను త్వ రలో ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు వెల్లడించారు. పట్టణంలోని 29వ వార్డు పరిధిలో శుద్ధిచేసిన తాగునీటి సరఫరాను సోమవారం ఆయన ప్రారంభించారు.
- ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు
రాయదుర్గం, జూన 8(ఆంధ్ర జ్యోతి): అమృత - 2 పథకం కింద రూ. 78 కోట్ల వ్యయంతో చేపట్టనున్న తాగునీటి ప్రాజెక్టు పనులను త్వ రలో ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు వెల్లడించారు. పట్టణంలోని 29వ వార్డు పరిధిలో శుద్ధిచేసిన తాగునీటి సరఫరాను సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణంలో తాగునీటి సరఫరా మెరుగు పరచడంతో పాటు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం పలు కీలకచర్య లు చేపడుతోందని తెలిపారు. ఇప్పటివరకు తాగునీటి సమస్య ఉన్న 27, 28, 29 వార్డుల్లోని పలు ప్రాంతాలకు ఇప్పటి నుంచి తాగునీరు సర ఫరా చేస్తామని పేర్కొన్నారు. కణేకల్లు రోడ్డు నుంచి శాంతినగర్ వరకు రూ. 30 లక్షల వ్యయంతో కొత్తపైప్‌లైన ఏర్పాటు చేసినట్లు వెల్లడిం చారు. మూడో వార్డులో రూ. 25 లక్షలతో పైపులైను ఏర్పాటు, రోడ్డు మరమ్మతులు చేస్తున్నామన్నారు. దీని వల్ల భవిష్యత్తులో మరిన్ని ఇళ్లకు కొత్తకొళాయి కనెక్షన్లు మంజూరు చేసే అవకాశం ఏర్పడుతుందన్నారు.
భూములపై సర్వాధికారాలు రైతుకే
రాయదుర్గం రూరల్: ప్రజలకు మేలైన పాలన అందించడంతో పాటు భూములపై రైతులకు సర్వాధికారాలు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పే ర్కొన్నారు. మండలంలోని గ్రామదట్ల గ్రామంలో సోమవారం రైతులకు పట్టాదారుపాసుపుస్తకాల పంపిణీని తహసీల్దార్ సూర్య ప్రతాప్ ఆ ధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కాలవ పా ల్గొన్నా రు. ముందుగా గ్రామంలో 15వ ఆర్థిక సంఘం నిధుల్లో భాగంగా ఎంపీపీ నిధులతో నిర్మించిన తాగునీటి శుద్ధజలం ప్లాంట్‌ను ఆయన ప్రారంభించారు. గత వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో రైతుల్లో గందరగోళం నెలకొందన్నారు.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆ నల్ల చట్టాన్ని రద్దు చేసి రైతులకు పూర్తి హక్కులను పునరుద్ధరించారని తెలిపారు. అనంతరం 1035 మం ది రైతులకు గాను 759 మందికి మంజూరైన పాసుపుస్తకాలను పంపిణీ చేశామని తహసీల్దార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కొండన్న, పంచాయతీ కార్యదర్శి హర్ష, టీడీపీ మండల కన్వీనర్ కురుబ హనుమంతు, మార్కెట్ యార్డ్ ఛైర్మన హనుమంతరెడ్డి, మాజీ సర్పంచ రాజశేఖర్‌రెడ్డి, కాటా వెంకటేశులు, భీమసేనరావు, క్లస్టర్ ఇనచార్జ్ సిద్ధప్ప, నాగిరెడ్డిపల్లి హనుమంతు, సోమశేఖర్, వన్నూరుస్వామి, కెంచానపల్లి సిద్ధప్ప, వన్నూరప్ప తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్‌ఎఫ్ చెక్కు పంపిణీ
కణేకల్లు: మండలంలోని మాల్యం గ్రామానికి చెందిన నారా యణ కు సీఎం సహాయనిధి కింద మంజూరైన రూ. 1.20 లక్షల చెక్కును ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సోమవారం రాయదుర్గంలోని క్యాంపు కార్యాలయంలో అందజేశారు. టీడీపీ నాయకులు ప్రభాకర్, శరభనగౌడ్, మహేష్, బసువరాజు, చంద్రశేఖర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....