Share News

ALUMNI: పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం

ABN , Publish Date - Jun 07 , 2026 | 12:03 AM

మండల పరిధిలోని ఉద్ధేహాళ్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం 2001-02 విద్యా సంవత్సరానికి చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. దాదాపు 24 ఏళ్ల తర్వాత వివిధ ప్రాంతాల్లో స్థిరప డిన విద్యార్థులు ఒకేచోట చేరి పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుని ఆనందంగా గడిపారు.

ALUMNI: పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం
Alumni with then teachers

బొమ్మనహాళ్‌, జూన 6(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని ఉద్ధేహాళ్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం 2001-02 విద్యా సంవత్సరానికి చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. దాదాపు 24 ఏళ్ల తర్వాత వివిధ ప్రాంతాల్లో స్థిరప డిన విద్యార్థులు ఒకేచోట చేరి పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుని ఆనందంగా గడిపారు. అప్పటి ఉపాధ్యాయు లు మేరీ రోజ్‌, శ్రీనివాసులు, కృష్ణకు మారి, భవాని, పరమేష్‌, రాఘవేంద్ర, మునేంద్ర, పెద్దన్న, పాఠశాల అప్పటి కమిటీ సభ్యులు అద్దాల ప్రసాదు, వెంకటేశుతో పాటు ప్రస్తుత ప్రధానోపాధ్యాయుడు ఆదిశేషయ్యను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు శంకర్‌, నాగరాజు, సుధాకర్‌, రఘు, గౌతమి, ధనలక్ష్మి, మంజుల, కేజియ తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం...

Updated Date - Jun 07 , 2026 | 12:03 AM