WATER: పైపులన్నీ లీకేజీలే..!
ABN , Publish Date - Apr 12 , 2026 | 11:24 PM
మండలంలోని పలు గ్రా మాలకు తాగు నీరందించే పైపులు పలు చోట్ల లీకేజీ అవుతున్నాయి. పట్టించుకునే నాథుడే లేడంటూ ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. విడపనకల్లు ఎస్‌ఎస్ ట్యాంక్ నుంచి పలు గ్రామాలకు రోజూ తాగు నీరు పంపింగ్ చేస్తుంటారు.
-కలుషితమవుతున్న తాగు నీరు
-ఇబ్బందులు పడుతున్న పలు గ్రామాల ప్రజలు
- పట్టించుకోని అధికారులు
విడపనకల్లు, ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు గ్రా మాలకు తాగు నీరందించే పైపులు పలు చోట్ల లీకేజీ అవుతున్నాయి. పట్టించుకునే నాథుడే లేడంటూ ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. విడపనకల్లు ఎస్‌ఎస్ ట్యాంక్ నుంచి పలు గ్రామాలకు రోజూ తాగు నీరు పంపింగ్ చేస్తుంటారు. అందుకు సంబంధించి విడప నకల్లు నుంచి చాబాల, మాళాపురం, పెద్ద కొట్టాలపల్లి, ఆర్ కొట్టాల, వీ కొత్తకోట తదితర తొమ్మిది గ్రామాలకు వేర్వేరు పైప్‌లైన్ల ద్వారా తాగు నీరు అందిస్తున్నారు. అయితే మాళాపురం, పెద్ద కొట్టాలపల్లికి వెళ్లే పైప్ లైన దాదాపు నాలుగు చోట్ల పగిలి పోయింది. లీక్ అవుతున్న నీటిలో కు క్కలు, గేదెలు సేద తీరుతున్నాయి. దీంతో తాగునీరు కలుషితమవు తోంది. బళ్లారి- అనంతపురం దారిలో రోజూ మండల అధికారులు కా ర్లు, ద్విచక్రవాహనాల్లో తిరుగుతుంటారని. వారికి ఈ లీక్‌లు కనిపిం చడం లేదా అని ఆయా గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. మండ లకేంద్రం సమీపంలో కొత్త డాబా, పెట్రోల్ బంక్, మాళాపురం వంక, కొట్టాలపల్లి వంక వద్ద ఏర్పడిన తీకేజీలను అరికట్టి తమ గ్రామాలకు కలుషితం కాని తాగు నీరు అందించాలని ప్రజలు కోరుతున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....