MLA: క్యాన్సర్ వైద్యసేవలకు సాయం
ABN , Publish Date - Mar 09 , 2026 | 11:40 PM
క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల తర్వాత వ్యాధి లక్షణాలు ఉన్న వారికి అవసరమైన వైద్యసేవల్లో తమ వంతు సహకారం అందిస్తామని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు హామీ ఇచ్చారు. పట్టణంలోని సీతారామాంజనేయస్వామి కల్యాణమండపంలో సోమవారం బసవతారక స్మారక క్యాన్సర్ ఆసుపత్రి సౌజన్యంతో ఎ మ్మెల్యే ఆధ్వర్యంలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
- ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు
రాయదుర్గం, మార్చి 9(ఆంధ్రజ్యోతి): క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల తర్వాత వ్యాధి లక్షణాలు ఉన్న వారికి అవసరమైన వైద్యసేవల్లో తమ వంతు సహకారం అందిస్తామని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు హామీ ఇచ్చారు. పట్టణంలోని సీతారామాంజనేయస్వామి కల్యాణమండపంలో సోమవారం బసవతారక స్మారక క్యాన్సర్ ఆసుపత్రి సౌజన్యంతో ఎ మ్మెల్యే ఆధ్వర్యంలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థానిక ప్రజల సౌకర్యార్థం బసవ తా రకం స్మారక క్యాన్సర్ వైద్యశాల సహకారంతో రాయదుర్గం పట్టణంలో వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం ఉచిత శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపా రు. అనుభవజ్ఞులైన వైద్యుల ద్వారా నిర్ధారణ జరిగితే, వారికి తదుపరి వైద్యసేవలకు అవసరమైన సాయం కల్పిస్తామన్నారు. ప్రజలు ఇలాంటి అవకాశాలను సద్వినియోగపరచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ : నిరుపేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక వరం లాంటిదని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొ న్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధికింద నియోజకవర్గం వ్యాప్తంగా 34 మందికి మంజూరైన రూ. 11 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. రాయదుర్గంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు కాలవ భరత, పట్టణ అధ్యక్షుడు బండి కృష్ణమూర్తి, మండల కన్వీనర్ కురుబ హనుమంతు, జిల్లా అధికార ప్రతినిధి పసుపులేటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....