Share News

COLLEGE: వేధిస్తున్న గదుల కొరత

ABN , Publish Date - Jun 26 , 2026 | 11:37 PM

పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. 2009లో బాలికల జూనియర్‌ కళాశాలను ఏర్పాటు చేశారు. ప్రారంభం నుంచి ఆ కళాశాల బాలుర కళాశాల గదుల్లోనే నిర్వహించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎంపీసీ, బైపీసీ, హెచఈసీ, సీఈసీ, ఎంఈసీ, ఎంబైపీసీ కోర్సులలో 370మంది దాకా విద్యార్థులు చదువుకుంటున్నారు.

COLLEGE: వేధిస్తున్న గదుల కొరత
Classes held in the same room where supplies are stored.

- కాంట్రాక్టు అఽధ్యాపకులతో నెట్టుకొస్తున్న వైనం

- బాలికల జూనియర్‌ కళాశాల పరిస్థితి ఇలా

ఉరవకొండ, జూన 26(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. 2009లో బాలికల జూనియర్‌ కళాశాలను ఏర్పాటు చేశారు. ప్రారంభం నుంచి ఆ కళాశాల బాలుర కళాశాల గదుల్లోనే నిర్వహించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎంపీసీ, బైపీసీ, హెచఈసీ, సీఈసీ, ఎంఈసీ, ఎంబైపీసీ కోర్సులలో 370మంది దాకా విద్యార్థులు చదువుకుంటున్నారు.


కేవలం ఆరు గదుల్లోనే తరగతు లను నిర్వహించాల్సి వస్తోంది. అలాగే ఉన్న గదుల్లనే మధ్యాహ్న భో జనం సరుకులను నిల్వ చేశారు. దీంతో ఇరుకు గదుల్లోనే చదువు కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ల్యాబ్‌లను కూడా బాలుర కళాశాల లోనే నిర్వ హిస్తున్నారు. బాలికలకు మరుగుదొడ్లు కూడా లేవు. 12 మంది అధ్యాపకులు ఉండాల్సి ఉండగా ముగ్గురు మాత్రమే రెగ్యులర్‌ అధ్యాపకులు ఉన్నారు. తొమ్మిది మంది కాంట్రాక్టు అధ్యాపకులతో నెట్టు కురావాల్సి వస్తోంది. కళాశాలల్లో ఫలితాలు మెరుగ్గా ఉన్నా, మౌలిక సదుపాయాలు కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నానటీచింగ్‌ స్టాఫ్‌ లేకపోవడంతో ప్రిన్సిపాలే అన్ని చూసుకోవాల్సి వస్తోంది. ఆర్వో ప్లాంట్‌ చెడిపోయి ఆర్నెల్లు కావస్తోంది. నాడు - నేడు క్రింద దానిని ఏర్పాటు చేయడంతో, దానికి సంబంధించిన టెక్నీషియన్ల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదు. ఈ విషయంపై ప్రిన్సిపాల్‌ షాషావలిని వివరణ కోరగా అదనపు గదుల నిర్మాణం కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపామని తెలిపారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 26 , 2026 | 11:37 PM