Share News

AADHAR: ఆధార్‌ అవస్థలు

ABN , Publish Date - Jun 18 , 2026 | 11:37 PM

మండలకేంద్రంలో ఆధార్‌కేం ద్రాలు పనిచేయక పోవడంతో ఆధార్‌కార్డుల్లో మార్పులు, చేర్పుల కోసం విద్యార్థులు, బయోమెట్రిక్‌ కోసం ఉపాధి కూలీలు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాడికిలో పలు సచివాలయాలు, పోస్టాఫీ సుతో పాటు ప్రైవేట్‌ ఆధార్‌ కేంద్రాలు ఉన్నాయి.

AADHAR: ఆధార్‌ అవస్థలు

- సచివాలయాల్లో, ప్రైవేట్‌ కేంద్రాల మూసివేతతో ఇబ్బందులు

యాడికి, జూన 18(ఆంధ్రజ్యోతి): మండలకేంద్రంలో ఆధార్‌కేం ద్రాలు పనిచేయక పోవడంతో ఆధార్‌కార్డుల్లో మార్పులు, చేర్పుల కోసం విద్యార్థులు, బయోమెట్రిక్‌ కోసం ఉపాధి కూలీలు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాడికిలో పలు సచివాలయాలు, పోస్టాఫీ సుతో పాటు ప్రైవేట్‌ ఆధార్‌ కేంద్రాలు ఉన్నాయి. ఆధార్‌ కార్డులలో కరెక్షనల కోసం సచివాలయాలకు వెళ్తే ‘ఇక్కడ ఆధార్‌ పనిచేయడం లేదు... ప్రైవేట్‌ కేంద్రాల వద్దకు వెళ్లండి’ అని అక్కడి సిబ్బంది ఉచిత సలహా ఇస్తూ పంపుతున్నారని స్థానికుల నుంచి ఆరోపణలు వస్తున్నా యి. ప్రైవేట్‌ ఆధార్‌ కేంద్రాలకు వెళితే అధిక రుసుం వసూలు చేయ డంతో పాటు రోజంతా ఎదురుచూడాల్సి వస్తోందని వాపోతున్నారు.


యాడికిలోని ఒక ప్రైవేట్‌ ఆధార్‌ కేంద్రం వద్ద సర్వర్‌ మెయిండెనెన్స వల్ల ఆధార్‌ సేవలు నిలిపిశామని నోటీసు ఏర్పాటుచేశారు. పోస్టా ఫీ సులో ఆధార్‌కు సంబంధించిన అన్ని సేవలు అందించడం లేదు. దీంతో ఆధార్‌లో సవరణల కోసం మండలవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. దీంతో తాడిపత్రి, గుత్తి తదితర ప్రాంతాలకు వెళ్లి ఆధార్‌లో సవరణలు చేసుకోవాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తగు చర్యలు చేపట్టి సచివాలయాల్లో ఆధార్‌ సేవలు అందించేలా తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

మా దృష్టికి రాలేదు - వీరరాజు, ఎంపీడీవో, యాడికి మండలం

ఆధార్‌ సవరణల కోసం సచివాలయాల వద్దకు వెళ్లిన వారిని వెనక్కి పంపుతున్న వి షయం మా దృష్టికి రాలేదు. ఎవరైనా ఫిర్యా దుచేస్తే సిబ్బందిపై తగిన చర్యలు తీసుకుం టాం. ఆధార్‌ కేంద్రాలు సక్రమంగా పనిచేసే లా చర్యలు తీసుకుంటాం. ఆధార్‌ సేవలపై ఉన్న ఇబ్బందులను తొలగించి పూర్తిస్థాయి లో సేవలు అందించేలా చర్యలు చేపడతాం.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 18 , 2026 | 11:37 PM