Share News

BRIDGE: కొట్టుకుపోయిన కల్వర్టు

ABN , Publish Date - Jun 04 , 2026 | 12:08 AM

కంబదూరు మండల పరిధిలోని జెల్లిపల్లిలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో కురిసిన ఎడతెరిపి లేని వర్షం ధాటికి గ్రామంలోని కల్వర్టు కొట్టుకుపోయింది. దీంతో సుమారు ఐదు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా బంద్‌ అయ్యా యి.

BRIDGE: కొట్టుకుపోయిన కల్వర్టు

- ఐదు గ్రామాలకు రాకపోకలు బంద్‌

కళ్యాణదుర్గం, జూన3(ఆంధ్రజ్యోతి): కంబదూరు మండల పరిధిలోని జెల్లిపల్లిలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో కురిసిన ఎడతెరిపి లేని వర్షం ధాటికి గ్రామంలోని కల్వర్టు కొట్టుకుపోయింది. దీంతో సుమారు ఐదు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా బంద్‌ అయ్యా యి. జెల్లిపల్లి, మేళ్లకుంట, కంబదూరు, మంద, కుర్లపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షం కురవడంతో కల్వర్టు పైభాగం అంతా కొట్టుకుపోయింది. దాంతో పాటు వ్యవసాయ తోటల్లో వర్షపు నీరు నిలబడింది. వర్షం ధాటికి కొట్టుకుపోయిన కల్వర్టుకు మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు అధికారులను కోరుతున్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 04 , 2026 | 12:08 AM