Share News

MINISTER: వందేళ్ల భూసమస్యకు పరిష్కారం

ABN , Publish Date - Apr 08 , 2026 | 12:04 AM

వంశ పారంపర్యంగా వందేళ్ల నుంచి సాగు చేసు కుంటున్నా పట్టాదారు పాసు పుస్తకాలు లేవని, ఆనలైనలో కూడా నమోదు కాలేదని,పరిష్కారం చూపాలని మండలంలోని మూల గిరిపల్లికి చెందిన రైతులు మంత్రిని కోరారు.

MINISTER: వందేళ్ల భూసమస్యకు పరిష్కారం
Farmers honoring Minister Keshav

- మంత్రికి కృతజ్ఞత తెలిపిన రైతులు

ఉరవకొండ, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): వంశ పారంపర్యంగా వందేళ్ల నుంచి సాగు చేసు కుంటున్నా పట్టాదారు పాసు పుస్తకాలు లేవని, ఆనలైనలో కూడా నమోదు కాలేదని,పరిష్కారం చూపాలని మండలంలోని మూల గిరిపల్లికి చెందిన రైతులు మంత్రిని కోరారు. వెంటనే స్పందించిన మంత్రి రెవెన్యూ అధికారులతో మాట్లాడి, పరి ష్కారం చూపాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు అధికారులతో సమీ క్షిస్తూ, పట్టాదారు పాసుపుస్తకాలు వచ్చేలా చొరవ తీసుకున్నారు. అనంతపురంలోని రాంనగర్‌లోని మంత్రి స్వగృహంలో సంబంధిత రైతులకు మంగళవారం ఆయన పాసుపుస్తకాలు అందజేశారు. వందేళ్లుగా ఉన్న సమస్యను పరిష్కరించిన మంత్రికి రైతులు జయప్ప, ఈశ్వరయ్య, మల్లయ్య, వెంకటేశులు, బసన్న, మహేష్‌లు ధన్యవాదాలు తెలిపారు. మంత్రిని శాలువా కప్పి సత్కరించారు.

నేడు ఉరవకొండలో మంత్రి పర్యటన

ఉరవకొండ: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ బుధారం పట్టణంలో పర్యటించనున న్నట్లు ఏఎంసీ చైర్మన విజయ్‌భాస్కర్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గంలోని వెలుగు వీఓఏలకు మంత్రి సెల్‌ఫోనలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అనంతరం ఆయన అన్నక్యాంటీన భవనాన్ని, ఉరవకొండ చెరువుకట్టను, ఉరవకొండలో కణేకల్లు క్రాస్‌ నుంచి నూతనంగా నిర్మించిన రోడ్డును పరిశీలిస్తారని తెలిపారు. అనంతరం పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణుల సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. అలాగే నియోజకవర్గంలో జరగనున్న బడ్జెట్‌ అవుట్‌ రీచ ఫ్రోగ్రాంలో పాల్గొంటారని పేర్కొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Apr 08 , 2026 | 12:04 AM