MLA: దశాబ్దాల సమస్యకు పరిష్కారం
ABN , Publish Date - Mar 11 , 2026 | 11:46 PM
పట్టణంలో దశాబ్దాల కాలంగా పరిష్కారం కాని కీలక మైన సమస్యలను తీర్చే దిశ గా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే కాలవ శ్రీవానివాసు లు పేర్కొన్నారు. పట్టణంలోని కూరగాయల మార్కెట్ వద్ద కొత్తగా నిర్మించిన రోడ్డును బుధవారం ఆయన పరిశీలించారు.
-ఎమ్మెల్యే కాలవ
రాయదుర్గం రూరల్, మార్చి 11(ఆంధ్రజ్యోతి): పట్టణంలో దశాబ్దాల కాలంగా పరిష్కారం కాని కీలక మైన సమస్యలను తీర్చే దిశ గా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే కాలవ శ్రీవానివాసు లు పేర్కొన్నారు. పట్టణంలోని కూరగాయల మార్కెట్ వద్ద కొత్తగా నిర్మించిన రోడ్డును బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జనసామర్థ్యం అధికంగా ఉండే కూరగాయల మార్కె ట్ చుట్టూ రూ. 32 లక్షలు ఖర్చుపెట్టి మంచిరోడ్డు నిర్మించామన్నారు. ప్రజల సౌకర్యార్థం ఆక్రమణలు తొలగించుకుని సహకరించిన స్థానికుల కు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే స్థానికం గా వాహనాల పార్కింగ్ స్థలం, ఇతరత్రా ఏర్పాట్లు చేయించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
పట్టణంలో గడిచిన 20 నెలల్లో ప్రజల మౌళిక అవసరాల కోసం ప్రభుత్వం రూ. తొమ్మిది కోట్ల వ్యయంతో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా సీసీరోడ్లు, కాలనీలో అంతర్గత రహదారులు, మురుగు కాలువలు, తాగునీటి సమస్యల పరిష్కారానికి అధి క ప్రాధాన్యం ఇచ్చామన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా మన్నారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు బండి కృష్ణమూర్తి, జిల్లా అధికార ప్రతినిధి నాగరాజు, మాజీ కౌన్సిలర్లు గాజుల వెంకటేశులు, కడ్డిపూడి మహ బూబ్‌బాషా, టంకశాల హనుమంతు, బండి భారతి, ప్రశాంతి, సంపతకుమారి, వై వెంకటేశులు తదితరులు పాల్గొన్నారు.