Share News

JSP: క్రియాశీలక సభ్యత్వంతో భద్రమైన భవిష్యత్తు

ABN , Publish Date - Mar 04 , 2026 | 11:33 PM

జనసేన క్రియాశీలక సభ్యత్వంతో భద్రమైన భవిష్యత్తు అని ఉద్యమి సభ్యత్వ కార్యక్రమం అనంతపురం పార్లమెంట్‌ సమన్వయకర్త, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన చైర్మన పసుపులేటి హరిప్రసాద్‌ పేర్కొన్నారు. స్ధానిక మున్సి పల్‌ కార్యాలయం వద్ద బుధవారం జనసేన ఉద్యమి క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త వాసిగిరి మణికంఠ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

JSP:  క్రియాశీలక సభ్యత్వంతో భద్రమైన భవిష్యత్తు
Hariprasad speaking in the meeting

- హస్తకళల అభివృద్ధి కార్పొరేషన చైర్మన హరిప్రసాద్‌

గుంతకల్లుటౌన, మార్చి 4(ఆంధ్రజ్యోతి): జనసేన క్రియాశీలక సభ్యత్వంతో భద్రమైన భవిష్యత్తు అని ఉద్యమి సభ్యత్వ కార్యక్రమం అనంతపురం పార్లమెంట్‌ సమన్వయకర్త, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన చైర్మన పసుపులేటి హరిప్రసాద్‌ పేర్కొన్నారు. స్ధానిక మున్సి పల్‌ కార్యాలయం వద్ద బుధవారం జనసేన ఉద్యమి క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త వాసిగిరి మణికంఠ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భం గా హరిప్రసాద్‌ మాట్లాడుతూ... ఉద్యమ స్ఫూర్తితో కార్యకర్తలు ముం దుకెళ్లాలన్నారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క రూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు కాయగూరల లక్ష్మీపతి, కాసెట్టి సంజీవరాయుడు, గ్రంధి దివాకర్‌, గుంతకల్లు, గుత్తి, పామిడి మండలాల అఽధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

ఉరవకొండ: జనసేన పార్టీ నిర్వహిస్తున్న ఉద్యమి సభ్యత్వం నమో దు కార్యకర్త కుటుంబానికి భరోసా ఇస్తుందని ఏపీ హస్తకళల కార్పొ రేషన చైర్మన హరిప్రసాద్‌ పేర్కొన్నారు. పట్టణంలోని వాల్మీకి కల్యాణ మండపంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు లక్ష్మీపతి, సంజీవ రా యుడు, గ్రంధి దివాకర్‌, నియోజక వర్గ ఇనచార్జ్‌ గౌతమ్‌ పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Mar 04 , 2026 | 11:33 PM