ROAD: కంకర తేలిన కష్టాల బాట
ABN , Publish Date - Jun 20 , 2026 | 11:51 PM
డి. హీరేహాళ్ మండలంలోని ఎం హనుమాపురం నుంచి కణేకల్లు మండ లం జక్కలవడికి గ్రామానికి వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. రోడ్డంతా కంకర తేలి ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ముఖ్యం గా ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
డి. హీరేహాళ్(బొమ్మనహాళ్), జూన 20(ఆంధ్రజ్యోతి): డి. హీరేహాళ్ మండలంలోని ఎం హనుమాపురం నుంచి కణేకల్లు మండ లం జక్కలవడికి గ్రామానికి వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. రోడ్డంతా కంకర తేలి ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ముఖ్యం గా ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టె ౖర్లకు రాళ్లు గుచ్చుకుని తరచూ పంక్చర్లు అవుతున్నాయని, వాహనాల టైర్లు త్వరగా దెబ్బతింటున్నాయని వాపోతున్నారు. వ్యవసాయ పనుల కోసం ఈ మార్గాన్ని వినియోగించే రైతులతో పాటు విద్యార్థులు, ఉద్యో గులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు.
రోడ్డుపై వేగంగా వెళ్లకపో యినా కంకర రాళ్ల కారణంగా వాహనాలు అదుపుతప్పి కిందపడుతు న్నాయని, పలువురు గాయపడ్డారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతు లు, ఉద్యోగులు నిత్యం ఈ మార్గంలోనే రాకపోకలు సాగిస్తుండటంతో ఇ బ్బందులు మరింత పెరిగాయని చెబుతున్నారు. అత్యవసర సమ యాల్లో రోగులను వాహనాల్లో తరలించేందుకు కూడా ఈ రహదారి ఇబ్బందికరంగా మారుతోందని పేర్కొంటున్నారు. చాలా ఏళ్లుగా రోడ్డు మరమ్మతులకు నోచుకోకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవు తోంది. ప్రమాదాలు జరగక ముంగే అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టి, బీటీ రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామస్థులు కోరుతున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....