Share News

MP: తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని చాటిన వ్యక్తి : ఎంపీ అంబికా

ABN , Publish Date - May 29 , 2026 | 12:13 AM

తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని ఎంపీ అంబికా లక్షీనారాయణ పేర్కొన్నారు. పట్టణంలోని దేవాంగ కల్యాణ మండపంలో నిర్వహించిన ఐదో క్లస్టర్‌ మహానాడులో ఎంపీ గురువారం పాల్గొన్నారు.

MP:  తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని చాటిన వ్యక్తి : ఎంపీ అంబికా
MP Ambika speaking in Uravakonda Mahanadu

ఉరవకొండ, మే 28(ఆంధ్రజ్యోతి): తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని ఎంపీ అంబికా లక్షీనారాయణ పేర్కొన్నారు. పట్టణంలోని దేవాంగ కల్యాణ మండపంలో నిర్వహించిన ఐదో క్లస్టర్‌ మహానాడులో ఎంపీ గురువారం పాల్గొన్నారు. అంతకు మునుపు ఆయన ఎన్టీఆర్‌ చిత్రపటానికి టీడీపీ నాయకులతో కలిసి పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. టీడీపీ యువతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలంతా టీడీపీ గెలుపే లక్ష్యంగా సాగాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. అదే విధంగా ఆయన బెళుగుప్ప మండలం తగ్గుపర్తి, విరుపాపల్లి, విడపనకల్లు మండలంలోని విడపనకల్లు, గడేకల్లు క్లస్టర్ల మహానాడు వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 29 , 2026 | 12:13 AM