Share News

BRIDGE: ప్రమాదాలకు నిలయం

ABN , Publish Date - Jun 15 , 2026 | 11:40 PM

మండలంలోని మైలాపు రం గ్రామ శివారులో వేదావతి హగరి నదిపై నిర్మించిన బ్రిడ్జి మృత్యు ఒడిగా మారింది. డి. హిరేహాళ్‌ మండలం సోమలాపురం వైపు నుంచి వచ్చే వాహనదారులకు బ్రిడ్జి వద్ద ఉన్న ఆకస్మిక మలుపు ప్రమాదక రంగా ఉంది. మలుపును గుర్తించలేక వాహనాలు బ్రిడ్జిపై వేగంగా వ స్తూ కాలువలోకి దూసుకెళ్తున్న ఘటనలు చోటు చేసుకుంటు న్నాయి.

BRIDGE: ప్రమాదాలకు నిలయం

- వేదవతి హగరి బ్రిడ్జి - మలుపు వద్ద లేని రక్షణ చర్యలు

బొమ్మనహాళ్‌, జూన 15(ఆంధ్రజ్యోతి): మండలంలోని మైలాపు రం గ్రామ శివారులో వేదావతి హగరి నదిపై నిర్మించిన బ్రిడ్జి మృత్యు ఒడిగా మారింది. డి. హిరేహాళ్‌ మండలం సోమలాపురం వైపు నుంచి వచ్చే వాహనదారులకు బ్రిడ్జి వద్ద ఉన్న ఆకస్మిక మలుపు ప్రమాదక రంగా ఉంది. మలుపును గుర్తించలేక వాహనాలు బ్రిడ్జిపై వేగంగా వ స్తూ కాలువలోకి దూసుకెళ్తున్న ఘటనలు చోటు చేసుకుంటు న్నాయి. ఇ ప్పటికే ఇద్దరు ప్రాణాలు కోల్పోయినా అధికారులు మాత్రం నిద్రమత్తు వీడడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రెండేళ్ల క్రితం కణేకల్లు మండలం 43 ఉడేగోళం గ్రామానికి చెందిన ఓ యువకుడు కర్ణాటక నుంచి మద్యం ప్యాకెట్లు తీసుకొస్తున్నాడు. ఎవరో వెంబడిస్తున్నారని వే గంగా వచ్చి మలుపు గమనించక నేరుగా కాలువలోకి పడిపోయాడు ఆ సమయంలో కాలువలో నీరులేకపోవడంతో తలపగలి అక్కడిక్కడే మృతి చెందాడు.


గత ఏడాది మైలాపురం గ్రామానికి చెందిన ఓ మహిళ కూడా ఇదే ప్రాంతంలో మృతి చెందింది. బ్రిడ్జిపై మలుపు వద్ద వాహ నం అదుపు తప్పి కాలువలో పడిపోవడంతో ఆమె గల్లంతైంది. అనం తరం మృతదేహాన్ని వెలికితీశారు. అయినా అధికారులు ప్రమాద నివార ణ చర్యలు చేపట్టకపోవడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు. బ్రిడ్జి వద్ద హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టర్లు, రక్షణ గోడలు లేకపోవ డంతో రాత్రి వేళల్లో ప్రమాద శాతం మరింత పెరుగుతోంది. ముఖ్యంగా కొత్తగా వచ్చే వాహనదారులు మలుపును అంచనా వేయలేక ఇబ్బందు లు పడుతున్నారని స్థానికులు అంటున్నారు. ప్రమాదాలు జరిగిన తర్వాత హడావుడి చేయడం తప్ప శాశ్వత చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 15 , 2026 | 11:40 PM