Share News

HELP: అనాథ చిన్నారులకు చేయూత

ABN , Publish Date - Jun 18 , 2026 | 11:53 PM

అనాథ లుగా మారిన చిన్నారులకు ట్రాన్సకో ఎగ్జిక్యూ టివ్‌ ఇంజనీర్‌ రవిశంకర్‌ రూ.20వేలు నగదు అందజే శారు. మండలంలోని పెద్దపేటకు చెందిన పల్లా శివ ప్రసాద్‌, భార్య హేమావతి చేతిలో హత్యకు గు రికావడం, హేమావతిని పోలీసులు అరెస్ట్‌ చేయడంతో వారి నలు గురు పిల్లలు అనాథలుగా మారారు.

HELP: అనాథ చిన్నారులకు చేయూత
Transco EE distributing financial aid to children.

యాడికి, జూన18(ఆంధ్రజ్యోతి): అనాథ లుగా మారిన చిన్నారులకు ట్రాన్సకో ఎగ్జిక్యూ టివ్‌ ఇంజనీర్‌ రవిశంకర్‌ రూ.20వేలు నగదు అందజే శారు. మండలంలోని పెద్దపేటకు చెందిన పల్లా శివ ప్రసాద్‌, భార్య హేమావతి చేతిలో హత్యకు గు రికావడం, హేమావతిని పోలీసులు అరెస్ట్‌ చేయడంతో వారి నలు గురు పిల్లలు అనాథలుగా మారారు. వారు పోలీసుల సాయంతో స్థానిక వృద్ధా శ్రమంలో ఆశ్రయం పొందుతున్నారు. ‘ఆ నలుగురు’ శీర్షికన అనాథ లుగా మారిన చిన్నారుల ఇబ్బందులను బుధవారం ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ కథనానికి స్పందించిన అనంతపురం ట్రాన్సకో ఈఈ రవిశంకర్‌ గురువారం యాడికి వచ్చి పోలీసులు, వృద్ధాశ్రమ నిర్వాహకుల సమక్షంలో చిన్నారులకు రూ.20వేలు నగదు సాయం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా బాలల రక్షణ సమితి ఔట్రీచ వర్కర్‌ కమలాక్షి, ఎస్‌ఐ గోపాల్‌, ఆగాపే వృద్ధాశ్రమ నిర్వాహకుడు ప్రసాద్‌ పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 18 , 2026 | 11:53 PM