Share News

WATER: చెత్త కుప్పల మధ్య కొళాయి

ABN , Publish Date - May 03 , 2026 | 11:25 PM

మండలంలోని దర్గా హొ న్నూరులో తాగునీటి కొళాయి వద్ద అపరిశుభ్రత తాండవిస్తోంది. ఇక్కడి పరిస్థితులు పంచాయతీ అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. ప్రజలు రోజూ ఉపయోగించే కొళాయి పక్కనే చెత్తకుప్పలు పేరుకు పోయాయి.

WATER: చెత్త కుప్పల మధ్య కొళాయి
A woman grabs drinking water from a tap amidst the filth

-అక్కడే తాగునీరు పట్టుకుంటున్న గ్రామస్థులు

బొమ్మనహాళ్‌, మే 3(ఆంధ్రజ్యోతి): మండలంలోని దర్గా హొ న్నూరులో తాగునీటి కొళాయి వద్ద అపరిశుభ్రత తాండవిస్తోంది. ఇక్కడి పరిస్థితులు పంచాయతీ అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. ప్రజలు రోజూ ఉపయోగించే కొళాయి పక్కనే చెత్తకుప్పలు పేరుకు పోయాయి. మురుగునీరు కాలువలా పారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న కొళాయి వద్దే మహిళలు, వృద్ధులు తాగునీరు పట్టుకోవాల్సి వ స్తోంది. ఈ నీరు తాగడం వల్ల ప్రజల ఆరోగ్యం ప్రశ్నార్థకంగా మారిం దని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలు, చెత్త పేరుకుపోవడం వల్ల కొళాయి నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందని పలుమార్లు విన్న వించినా పంచాయతీ అధికారులు కనీస చర్యలు తీ సుకోవడం లేదని గ్రామస్థులు మండిపడుతున్నారు. దీని వల్ల గ్రామం లో వ్యాధులు వ్యాపించే పరిస్థితి ఉందంటున్నారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు స్పందించి కొళాయి పరిసరాలను పరిశుభ్రంగా మార్చాలని గ్రామస్థులు డిమాండ్‌ చేస్తున్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 03 , 2026 | 11:25 PM