Share News

BUILDING: శిథిలావస్థలో భవనం

ABN , Publish Date - May 26 , 2026 | 11:40 PM

మండలంలోని అంచనహా లు గ్రామ సచివాలయ భవనం పూర్తిగా శిథిలమై పోయింది. సిబ్బంది తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విధులు నిర్వహిస్తున్నారు. ఎప్పుడు ఏ గోడ కూలుతుందో అనే భయాందోళన వారిలో నెల కొంది. గ్రామంలోని పాత పంచాయతీ కార్యాలయంలోనే గ్రామ సచివాలయా న్ని నిర్వహిస్తున్నారు.

BUILDING: శిథిలావస్థలో భవనం
Ravi tree grew from the top of the building

-గోడల్లోకి చొచ్చుకెళ్లిన చెట్టు వేర్లు

- పెచ్చులూడుతున్న పైకప్పు

- భయంభయంగా విధుల్లో గ్రామ సచివాలయ సిబ్బంది

విడపనకల్లు, మే 26(ఆంధ్రజ్యోతి): మండలంలోని అంచనహా లు గ్రామ సచివాలయ భవనం పూర్తిగా శిథిలమై పోయింది. సిబ్బంది తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విధులు నిర్వహిస్తున్నారు. ఎప్పుడు ఏ గోడ కూలుతుందో అనే భయాందోళన వారిలో నెల కొంది. గ్రామంలోని పాత పంచాయతీ కార్యాలయంలోనే గ్రామ సచివాలయా న్ని నిర్వహిస్తున్నారు. కొత్త భవన నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపో యింది. ప్రస్తుతం గ్రామ సచివాలయం నిర్వహిస్తున్న భవనంలో రెం డు గదులు ఉన్నాయి. మిద్దెపై పెరిగిన ఓ రావి చెట్టు వేర్లు ఆ రెండు గదుల గోడల మధ్య నుంచి పునాది వరకు దిగాయియి. ఈ వేర్ల దె బ్బకు గోడల్లో చీలికలు వచ్చాయి. అదే విధంగా పై కప్పు ఎప్పుడు కూ లి పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. సచివాలయం మొత్తం శిథి లావస్థకు చేరింది. ఇక వర్షాకాలం వస్తూ ఉండటంతో గోడలు వర్షాలకు తడిసి నెమ్ము పడితే ఏమి జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. దాదా పుగా పది మంది సిబ్బంది అంచనహాలు సచివాలయంలో విదులు నిర్వహిస్తున్నారు. నూతన సచివాలయ భవన నిర్మాణం నిధుల కొరతతో నిలిచి పోయింది. ప్రస్తుతం కొంత నిధులు ఖర్చు చేస్తే దాని నిర్మాణం పూర్తవుతుందని ప్రజలు అంటున్నారు.


ఆ దిశగా ప్రభుత్వం, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయమై డిప్యూటీ ఎంపీడీఓ సత్యబాబును వివరణ కోరగా ... మండలంలో అర్ధాంతరంగా నిలిచి పోయిన సచివాలయాల మరమ్మతులకు రూ. 9.60కోట్లు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. వాటి జాబితాలో అంచనహా లు సచివాయలం కూడా ఉందన్నారు.. టెండర్ల ప్రక్రియ పూర్తి కాగానే పనులు పూర్తి చేసి సిబ్బందికి ఇబ్బందులు కలుగకుండా చేస్తామని ఆయన వివరించారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 26 , 2026 | 11:40 PM