Share News

ROAD: మారనున్న రూపురేఖలు

ABN , Publish Date - Mar 11 , 2026 | 11:37 PM

జాతీయ గ్రామీణ ఉపాధి హ మీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో మండలంలో వివిధ గ్రామాల్లోని వీధుల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. పల్లె పండుగ-2.0 కింద సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 2.86 కోట్ల నిధులు మంజూరు చేశారు.

ROAD: మారనున్న రూపురేఖలు
Sangameshwara Swamy Devasthanam road with potholes

- గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధుల మంజూరు

కూడేరు, మార్చి 11(ఆంధ్రజ్యోతి): జాతీయ గ్రామీణ ఉపాధి హ మీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో మండలంలో వివిధ గ్రామాల్లోని వీధుల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. పల్లె పండుగ-2.0 కింద సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 2.86 కోట్ల నిధులు మంజూరు చేశారు. దీంతో గ్రామాల్లో వీధులు పరిశుభ్రంగా మారను న్నాయి. పల్లెపండుగ-2.0 కింద విడుదలైన నిధుల్లోనే మండలంలో ప్రసిద్ధి చెందిన జోడు లింగాల సంగమేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే దారి పనులు మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. కూటమి పాలనలో పల్లెపండుగ-1 కింద రూ, 2. 06 కోట్లతో రోడ్ల పనులు పూర్తి కాగా, పల్లెపండుగ-2 కింద రూ, 2.86 కోట్లతో పనులు ప్రారంభిచనున్నారు.


ఇందులో కొర్రకోడు గ్రామం లో సీసీరోడ్ల నిర్మాణానికి రూ. 9.60 లక్షలు, ఉదిరిపికొండలో రూ. 5లక్ష లు, జల్లిపల్లిలో రూ. 5లక్షలు, మరుట్లలో రూ. 21 లక్షలు, ఇప్పేరులో రూ. 20లక్షలు, కూడేరులో 1.21కోట్లు, చోళసముద్రంలో రూ. 5 లక్షలు, కమ్మూరులో రూ. 5లక్షలు, అరవకూరులో రూ. 5లక్షలు, తిమ్మాపురంలో రూ. 12లక్షలు, గొట్కూరులో 49.50లక్షలు, పి. నారాయణపురంలో రూ. 30లక్షలు చొప్పున నిధులు విడుదలయ్యాయి. ఈ పనులు త్వరలోనే ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. సంగమేశ్వరస్వామి ఉత్సవాల్లోగా కూడేరులో పనులు పూర్తి చేస్తామని పంచాయతీరాజ్‌ ఏఈ రమణయ్య తెలియజేశారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Mar 11 , 2026 | 11:37 PM