Share News

గంగనపల్లి ఎంపీటీసీ బరిలో అక్కాచెల్లెళ్లు

ABN , Publish Date - Oct 30 , 2026 | 01:27 AM

ఒకే తల్లి పిల్లలు ఎన్నికల్లో ప్రత్యర్థులయ్యారు. అనంతపురం జిల్లా నార్పల మండలం గంగనపల్లి ఎంపీటీసీ స్థానానికి వైసీపీ తరఫున ఎన్‌.లలితమ్మ, టీడీపీ తరఫున ఎన్‌.సువర్ణ బరిలో దిగారు.

గంగనపల్లి ఎంపీటీసీ బరిలో అక్కాచెల్లెళ్లు

నార్పల, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): ఒకే తల్లి పిల్లలు ఎన్నికల్లో ప్రత్యర్థులయ్యారు. అనంతపురం జిల్లా నార్పల మండలం గంగనపల్లి ఎంపీటీసీ స్థానానికి వైసీపీ తరఫున ఎన్‌.లలితమ్మ, టీడీపీ తరఫున ఎన్‌.సువర్ణ బరిలో దిగారు. వీరి పుట్టినిల్లు, మెట్టినిల్లు కూడా ఒక్కటే. పెళ్లి చేసుకుంది ఒకే ఇంటి వారినే. అయినా సరే.. స్థానిక ఎన్నికల్లో ప్రధాన పార్టీల తరఫున బరిలో దిగారు. ఎవరు గెలిచినా, విజయం వీరి గడప దాటదు. నార్పల మండలం తుంపెర గ్రామానికి చెందిన కొండారెడ్డి, రామాంజినమ్మ దంపతులకు ఆరుగురు కుమార్తెలు. వీరిలో లలితమ్మ, సువర్ణ ఎన్నికల్లో పోటీకి దిగారు.

ఈ వార్తలనూ చదవండి:

తుఫాన్ సహాయక పర్యవేక్షణకు త్వరలో ఎస్ఓపీ విధానం తెస్తాం: సీఎం చంద్రబాబు

ఆర్నబ్ తుఫాన్ వేళ.. ఏపీకి తెలంగాణ అండ.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు

Updated Date - Oct 30 , 2026 | 01:27 AM