అమరావతిలో క్రౌన్ ప్లాజా హోటల్
ABN , Publish Date - Oct 26 , 2026 | 05:02 AM
రాజధాని అమరావతిలో క్రౌన్ ప్లాజా ఫైవ్‌స్టార్ హోటల్ నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. అమరావతిలోని శాఖమూరు రెవెన్యూలో ఇండ్‌రాయల్ హాస్పిటాలిటీ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్మాణం కానున్న క్రౌన్ ప్లాజా హోటల్‌కు..
రూ.350 కోట్లతో నిర్మాణానికి భూమిపూజ
తుళ్లూరు, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో క్రౌన్ ప్లాజా ఫైవ్‌స్టార్ హోటల్ నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. అమరావతిలోని శాఖమూరు రెవెన్యూలో ఇండ్‌రాయల్ హాస్పిటాలిటీ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్మాణం కానున్న క్రౌన్ ప్లాజా హోటల్‌కు ఆదివారం భూమి పూజ జరిగినట్టు సీఆర్డీఏ కార్యాలయం తెలిపింది. శాఖమూరులో 4 ఎకరాల్లో.. రూ.350 కోట్ల వ్యయంతో ఈ హోటల్‌ను నిర్మించనున్నారు. ఇక్కడ 500 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. సమావేశాల కోసం ప్రత్యేక హాళ్లు, రెస్టారెంట్లు, స్విమ్మింగ్ పూల్, జిమ్ తదితర సదుపాయాలు ఈ హోటల్‌లో ఉంటాయి. భూమిపూజ కార్యక్రమంలో సీఆర్డీఏ కమిషనర్ విజయరామరాజు, ఎకనామిక్ డెవల్‌పమెంట్ విభాగ ప్రాజెక్టు మేనేజర్ ఎంపీజే రాజు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి.శివప్రదీప్‌రెడ్డి, ఇండ్‌రాయల్ సంస్థ చైర్మన్ సుగథన్ జనార్థన్, డైరెక్టర్ సుని సుగథన్, సీఎఫ్‌వో బిజూ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
అర్నాబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు హై అలర్ట్.. ముందస్తు చర్యలకు ఆదేశం