Share News

పేదింట పుట్టే ఆడబిడ్డలకు 10 వేలు

ABN , Publish Date - Nov 25 , 2026 | 04:59 AM

పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు వినూత్న హామీలతో ప్రచారం చేస్తున్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం మండలం కామనగరువు గ్రామంలో

పేదింట పుట్టే ఆడబిడ్డలకు 10 వేలు

అమలాపురం రూరల్‌, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు వినూత్న హామీలతో ప్రచారం చేస్తున్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం మండలం కామనగరువు గ్రామంలో కూటమి మద్దతుతో సర్పంచ్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ సర్పంచ్‌ రాజులపూడి వెంకటేశ్వరరావు (భీముడు) తనను గెలిపిస్తే, గ్రామంలో నిరుపేదల ఇంట ఆడపిల్ల పుడితే రూ.10 వేలు చొప్పున ఇస్తానని హామీ ఇచ్చారు.

అంతేకాకుండా వారి చదువులకు అండగా ఉంటానని చెబుతున్నారు. ప్రతి ఇల్లు ఆడపిల్లలతో కళకళలాడాలని, అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఐదేళ్ల పదవీ కాలంలో గ్రామంలో ఎంత మంది ఆడపిల్లలు పుట్టినా వారందరికీ రూ.10వేలు చొప్పున ఇస్తానని తెలిపారు. ఇది హామీ కాదని, తన బాధ్యత అని భీముడు పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ఎస్‌ఐపీబీ సమావేశంలో కీలక నిర్ణయాలు

అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి

Updated Date - Nov 25 , 2026 | 05:03 AM