దసరా ఉత్సవాల్లో విషాదం
ABN , Publish Date - Oct 23 , 2026 | 05:00 AM
దసరా ఉత్సవాల్లో ఘర్షణ చెలరేగి కత్తిపోట్లకు దారితీయడంతోపాటు, అగ్నికీలలు ఎగసిపడిన ఘటనల్లో పలువురు గాయాలపాలై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బుధవారం రాత్రి అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో ఈ విషాద ఘటనలు జరిగాయి.
రెండు వీధుల మధ్య చెలరేగిన ఘర్షణ
నిలువరించే యత్నంలో ఐ.పోలవరం ఎస్‌ఐకు కత్తిపోట్లు
అగ్నికీలలు ఎగిసి మరో 17 మందికి గాయాలు
కోనసీమ జిల్లా అమలాపురంలో ఘటనలు
అమలాపురం, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): దసరా ఉత్సవాల్లో ఘర్షణ చెలరేగి కత్తిపోట్లకు దారితీయడంతోపాటు, అగ్నికీలలు ఎగసిపడిన ఘటనల్లో పలువురు గాయాలపాలై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బుధవారం రాత్రి అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో ఈ విషాద ఘటనలు జరిగాయి. పట్టణంలోని ముమ్మిడివరం గేటులో దసరా పండుగ అనంతరం నిర్వహించిన చెడింతాలింఖానా ఉత్సవ ఊరేగింపుల సందర్భంగా రెండు వీధులకు చెందిన ఉత్సవ నిర్వాహకుల మధ్య ఘర్షణ చెలరేగింది. రెండు వీధులకు చెందిన యువకులు కత్తులతో దాడులకు దిగడంతో బందోబస్తు విధుల్లో ఉన్న ఐ.పోలవరం ఎస్‌ఐ ఎంవీవీ రవీంద్రబాబు నిలువరించే క్రమంలో కత్తిపోట్లకు గురయ్యారు.
తీవ్ర రక్తస్రావమైన ఆయన్ను హుటాహుటిన ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు లాఠీచార్జి చేసి రెండు గ్రూపులను చెదరగొట్టారు. ఎస్‌ఐపై దాడికి కారణమైన చిక్కాల రాంబాబు, పనస బుజ్జి, దూలం అబ్బాయితాత, పనస అబ్బు, గుమ్మళ్ల శ్రీను, యేడిద వీరుతోపాటు మరికొందరిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అదేవిధంగా పట్టణంలోని రవణంవీధిలో మహిషాసురమర్దిని అమ్మవారి ఊరేగింపు సందర్భంగా బోనాలు వేసేక్రమంలో అగ్నికీలలు ఎగసిపడి నిర్వాహకులతో పాటు 15 మంది వరకు గాయాలపాలయ్యారు.
ఈ వార్తలనూ చదవండి: