Share News

ఆ పంచాయతీలో ‘అతివల’ రాజ్యం!

ABN , Publish Date - Nov 24 , 2026 | 06:16 AM

అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండలం లింగభూపాలపుర (ఎల్‌బీపీ) ఆగ్రహారం పంచాయతీలో మహిళా సాధికారతకు పట్టం కట్టారు.

ఆ పంచాయతీలో ‘అతివల’ రాజ్యం!

  • సర్పంచ్‌, వార్డు సభ్యులందరూ మహిళలే

  • ఎల్‌బీపీ అగ్రహారంలో అంతా ఏకగ్రీవమే..

బుచ్చెయ్యపేట, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండలం లింగభూపాలపుర (ఎల్‌బీపీ) ఆగ్రహారం పంచాయతీలో మహిళా సాధికారతకు పట్టం కట్టారు. సర్పంచ్‌తో పాటు గ్రామంలోని వార్డులన్నింటికీ సభ్యులుగా మహిళలనే ఎన్నుకోవడం విశేషం. అది కూడా ఎలాంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా..! మొత్తం మహిళా పాలక వర్గంతో ఎల్‌బీపీ అగ్రహారం పంచాయతీ ఆదర్శంగా మారింది. ఈ పంచాయతీలో సర్పంచ్‌ పదవి మహిళలకు రిజర్వు అయ్యింది. ఈ క్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యకుడు తమరాన దాసు భార్య ఉమ సర్పంచ్‌ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

అలాగే గ్రామంలోని ఎనిమిది వార్డుల్లోనూ మహిళలనే నిలబెట్టి.. వారిని కూడా గ్రామస్తులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహక బహుమతితో గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చనే ఉద్దేశంతో తామంతా చర్చించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు గ్రామస్తులు వెల్లడించారు.

ఈ వార్తలనూ చదవండి:

చేతులెలా వచ్చాయ్‌!

నామినీ ఉంటేనే బీమా

Updated Date - Nov 24 , 2026 | 06:32 AM