Share News

ఏఐ టెక్నాలజీతో మంత్రి సంతకం ఫోర్జరీ.. తండ్రీకొడుకుల అరెస్ట్

ABN , Publish Date - Apr 30 , 2026 | 08:39 AM

సాధారణంగా టెక్నాలజీని పనులు సులువు చేసుకోవడానికి ఉపయోగిస్తారు. కానీ, కొందరు మాత్రం దానిని నేరాలకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చుకుంటున్నారు.

ఏఐ టెక్నాలజీతో మంత్రి సంతకం ఫోర్జరీ.. తండ్రీకొడుకుల అరెస్ట్
Minister Signature Fake

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా టెక్నాలజీని పనులు సులుభరం చేసుకోవడానికి ఉపయోగిస్తారు. కానీ, కొందరు మాత్రం దానిని నేరాలకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చుకుంటున్నారు. తాజాగా, చాట్ జీపీటీ(ChatGPT) వంటి ఏఐ టూల్స్‌ను వినియోగించి సాక్షాత్తూ రాష్ట్ర మంత్రి సంతకాన్నే ఫోర్జరీ చేసిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అన్నమయ్య జిల్లా కదిరి మండలం కౌలేపల్లికి చెందిన పలక వేణు, ఆయన కుమారుడు పలక గంగాద్రిలు ఈ మోసానికి తెరలేపారు.


నర్సింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న రమణమ్మ అనే మహిళకు బదిలీ చేయిస్తామని నమ్మబలికారు వేణు, గంగాద్రిలు. అందుకోసం ఓ అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారు. నిందితులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) టూల్స్‌ను ఉపయోగించి అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. ప్రభుత్వ అధికారిక ఉత్తర్వుల(GO) ప్రతిని పోలిఉండేలా డూప్లికేట్ ఆర్డర్ కాపీని సృష్టించారు. ఏఐ సాఫ్ట్‌వేర్ సాయంతో మంత్రి సత్యకుమార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి, దాన్ని అసలు సంతకంలా కనిపించేలా జాగ్రత్తపడ్డారు. ఈ నకిలీ బదిలీ ఉత్తర్వులను రమణమ్మకు అందజేసి, ఆమెను నమ్మించారు .

అయితే.. ఈ ఆర్డర్ కాపీ సంబంధిత శాఖాధికారుల వద్దకు వెళ్లినప్పుడు, అందులోని అంశాలపై అనుమానం రావడంతో విచారణ చేపట్టారు. అది నకిలీదని, మంత్రి సంతకాన్ని ఫోర్జరీ చేశారని తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. వేణు, గంగాద్రిలను అరెస్ట్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బంగారం కొనాలనుకుంటున్నారా.. మరింత తగ్గిన ధరలు..

మండుతున్న ఎండలు

Updated Date - Apr 30 , 2026 | 11:47 AM