Share News

అన్ని రంగాల్లో మహిళల సత్తా

ABN , Publish Date - Nov 20 , 2026 | 01:19 AM

మహిళా శక్తి అనంతమని, మనసుపెట్టి ఏ కార్యక్రమం చేపట్టినా తిరుగులేని విజయం సాధించగల సత్తా మహిళల సొంతమని సినీనటి రష్మిక మందన్న అన్నారు.

అన్ని రంగాల్లో మహిళల సత్తా

  • మహిళల విద్యకు సత్యసాయి ప్రాధాన్యం

  • సత్యసాయి 101 జయంతి వేడుకల్లో నటి రష్మిక మందన్న

  • పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఘనంగా మహిళా దినోత్సవం

పుట్టపర్తి, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): మహిళా శక్తి అనంతమని, మనసుపెట్టి ఏ కార్యక్రమం చేపట్టినా తిరుగులేని విజయం సాధించగల సత్తా మహిళల సొంతమని సినీనటి రష్మిక మందన్న అన్నారు. సత్యసాయి 101వ జయంతి వేడుకల్లో భాగంగా శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో జరిగిన మహిళా దినోత్సవంలో గురువారం ఆమె ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ‘నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభను చాటుతున్నారు.

సత్యసాయి తన మాతృమూర్తి ఈశ్వరమ్మ కోరిక మేరకు ఏడు దశాబ్దాల కిందటే ఉచిత విద్య, వైద్య సేవలకు శ్రీకారం చుట్టారు. బాబా చేపట్టిన ఈ సేవలు ఎందరికో ఆదర్శంగా నిలిచాయి. నా భర్త విజయ్‌ దేవరకొండ సత్యసాయి విద్యార్థి. ఆయన ద్వారా నాకు సత్యసాయి తత్త్వం, ఆధ్యాత్మికత గురించి తెలిశాయి..’ అని తెలిపారు. మహిళలు.. కుటుంబం అనే గృహానికి మూలస్తంభాలని కర్ణాటక మాజీ చీఫ్‌ సెక్రటరీ వందిత శర్మ అన్నారు. కాగా, నటి రష్మిక, డాక్టర్‌ నీలం జై సాయి, కర్ణాటక మాజీ చీఫ్‌ సెక్రటరీ వందిత శర్మ జ్యోతి ప్రజ్వలన చేసి మహిళా దినోత్సవాన్ని ప్రారంభించారు.

ఈ వార్తలనూ చదవండి:

ఏపీ తీరానికి అక్వాన్ తుపాను ముప్పు.. గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటే అవకాశం: ఏపీఎస్‌డీఎంఏ

బాలకృష్ణకు విశిష్ట పురస్కారం.. రేవంత్ సర్కార్ నుంచి అరుదైన గౌరవం

Updated Date - Nov 20 , 2026 | 01:22 AM