Share News

అధర్మ రాజకీయాలను ప్రజలు తిరస్కరించాలి: అచ్చెన్న

ABN , Publish Date - Oct 20 , 2026 | 05:23 AM

నాడు మహిషాసురుడి అహంకారాన్ని దుర్గమ్మ అంతం చేసినట్లే.. నేడు రాజకీయ మహిషాసురులకు ప్రజాతీర్పే గుణపాఠం కావాలని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.

అధర్మ రాజకీయాలను  ప్రజలు తిరస్కరించాలి: అచ్చెన్న
achennanaidu

అమరావతి, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): నాడు మహిషాసురుడి అహంకారాన్ని దుర్గమ్మ అంతం చేసినట్లే.. నేడు రాజకీయ మహిషాసురులకు ప్రజాతీర్పే గుణపాఠం కావాలని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. రైతులకు, రాష్ట్ర ప్రజలకు సోమవారం ఓ ప్రకటనలో ఆయన విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ‘అధర్మానికి అంతం తప్పదు. ధర్మానికి విజయం తథ్యం. జగన్‌ అహంకారానికి, అరాచక రాజకీయాలకు రాష్ట్రంలో స్థానం లేదు. అధికారం శాశ్వతమని విర్రవీగిన వారికి ప్రజాస్వామ్యంలో పరాభవం తప్పదు. అధర్మ రాజకీయాలను ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా తిరస్కరించాలి. ఇలాంటి వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలి’ అని అచ్చెన్న పిలుపునిచ్చారు.

ఈ వార్తలు కూడా చదవండి

ప్రధాని పర్యటన ఏర్పాట్లపై ఐబీ సమీక్ష

నేడు స్విమ్స్‌ ఓపీ, ఓటీలకు సెలవు

Updated Date - Oct 20 , 2026 | 05:24 AM