Share News

400 కి.మీ. ఓటు ప్రయాణం

ABN , Publish Date - Oct 25 , 2026 | 05:45 AM

పోలవరం ప్రాజెక్టు కోసం సర్వస్వం త్యాగం చేసిన గిరిజనులు.. ఇప్పుడు ఓటు హక్కును వినియోగించుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఓటు వేసేందుకు రానుపోను సుమారు 400 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన దయనీయ పరిస్థితిలో ఉన్నారు.

400 కి.మీ. ఓటు ప్రయాణం

  • పోలవరం నిర్వాసిత గిరిజనుల అవస్థలు

  • పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి రావడానికి రూ. 1,000కి పైగా ఖర్చు

బుట్టాయగూడెం, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు కోసం సర్వస్వం త్యాగం చేసిన గిరిజనులు.. ఇప్పుడు ఓటు హక్కును వినియోగించుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఓటు వేసేందుకు రానుపోను సుమారు 400 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన దయనీయ పరిస్థితిలో ఉన్నారు. పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్‌ చింతూరు ఐటీడీఏ పరిధిలోని వీఆర్‌పురం మండలానికి చెందిన కొండరెడ్డి గిరిజన గ్రామాలైన కొల్లూరు, కొండేపూడి, తుమ్ములేరు, పోచవరం, చొక్కనపల్లి వాసులను ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం రామన్నగూడెం ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి కొన్నేళ్ల క్రితం తరలించారు.

ఐదు గ్రామాలకు చెందిన 350 మంది వరకు ఓటర్లు ఇక్కడ నివసిస్తున్నారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించిన ప్రభుత్వం, అధికారులు.. వారి ఆధార్‌, ఓటర్‌ ఐడీ, రేషన్‌ కార్డుల్లో స్థానికతను మార్చలేదు. దీంతో వారు ప్రతి చిన్న పనికీ వందలాది కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో వారు ఓటు వేసేందుకు గతంలోని పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లాల్సి ఉంది. మొదట రామన్నగూడెం నుంచి వేలేరుపాడు మండలం కొయిదా వరకు రోడ్డు ప్రయాణం చేయాలి. అక్కడ బోటు ఎక్కి గోదావరిలో 2కిలోమీటర్లు ప్రయాణించాక మరో 2కిలోమీటర్లు కాలినడకన పోచవరంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రానికి చేరుకోవాలి. ఒక్కో వ్యక్తికి రూ.1,000 వరకు ఖర్చవుతుంది. రామన్నగూడెం ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీని ప్రత్యేక పంచాయతీగా గుర్తించి రేషన్‌, ఆధార్‌ కార్డులు, ఓటర్‌ ఐడీలను మార్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

కానరాని ఎన్నికల సందడి

భీతావహం

Updated Date - Oct 25 , 2026 | 05:45 AM