Share News

జల్‌జీవన్‌ మిషన్‌ 2.0కు రూ.212.17 కోట్లు

ABN , Publish Date - Oct 02 , 2026 | 05:20 AM

జల్‌జీవన్‌ మిషన్‌ (జేజేఎం) 2.0 కింద ఆంధ్రప్రదేశ్‌లో సహాయ కార్యక్రమాలు, నీటి నాణ్యత పర్యవేక్షణ నిఘా కార్యక్రమాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.212.17 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.

జల్‌జీవన్‌ మిషన్‌ 2.0కు రూ.212.17 కోట్లు

  • సహాయ కార్యక్రమాలకు రూ.151.5 కోట్లు

  • పరిపాలనా అనుమతులు మంజూరు

అమరావతి, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): జల్‌జీవన్‌ మిషన్‌ (జేజేఎం) 2.0 కింద ఆంధ్రప్రదేశ్‌లో సహాయ కార్యక్రమాలు, నీటి నాణ్యత పర్యవేక్షణ నిఘా కార్యక్రమాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.212.17 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఈ నిధులను వినియోగించనున్నారు. కేంద్రం వాటాగా రూ.127.30 కోట్లు, రాష్ట్ర వాటాగా రూ.84.87 కోట్లతో కలిపి మొత్తం రూ.212.17 కోట్లను కేటాయించారు. ఇందులో సహాయ కార్యక్రమాలకు కేంద్రం రూ.90.93 కోట్లు, రాష్ట్రం రూ.60.62 కోట్లు కలిపి రూ.151.55 కోట్లు ఉన్నాయి. అలాగే నీటి నాణ్యత పర్యవేక్షణ, నిఘా కార్యక్రమాలకు కేంద్రం రూ.36.37 కోట్లు, రాష్ట్రం రూ.24.25 కోట్లు కలిపి రూ.60.62 కోట్లు కేటాయించారు. ఏడాది వారీగా విడుదల చేసే బడ్జెట్‌కు అనుగుణంగానే ఖర్చు చేయాలని, అదనంగా రాష్ట్రంలోని ప్రత్యేక వనరుల నుంచి ఈ కార్యక్రమాలకు ఎలాంటి ఖర్చూ చేయరాదని ఆదేశించింది. ఈ మేరకు తదుపరి చర్యలు చేపట్టాలని గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్యశాఖ ఇంజనీర్‌-ఇన్‌-చీఫ్‌ను ఆదేశించింది.

ఈ వార్తలనూ చదవండి:

వివేకా కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. వారికి నోటీసులు

ప్రభుత్వ భూములకు స్కెచ్‌

Updated Date - Oct 02 , 2026 | 05:20 AM