ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటు నమోదుకు 27 వేల దరఖాస్తులు
ABN , Publish Date - Nov 08 , 2026 | 01:34 AM
రాష్ట్రంలోని ఉమ్మడి కృష్టా-గుంటూరు, తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటరు నమోదుకు 27,397 దరఖాస్తులు వచ్చినట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.
ముగిసిన దరఖాస్తు గడువు
25న ముసాయిదా ఓటర్ల జాబితా
డిసెంబరు 30న తుది జాబితా ప్రచురణ
అమరావతి, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఉమ్మడి కృష్టా-గుంటూరు, తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటరు నమోదుకు 27,397 దరఖాస్తులు వచ్చినట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ గడువు శుక్రవారం అర్ధరాత్రితో ముగిసింది. ఈ నెల 25న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. ముసాయిదా ఓటర్ల జాబితాపై ఈ నెల 25 నుంచి డిసెంబరు 10 వరకు అభ్యంతరాలు, క్లైయుములు స్వీకరిస్తారు. ఆ అభ్యంతరాలను డిసెంబరు 25 లోగా పరిష్కరించి, డిసెంబరు 30న తుది ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. 2021లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల నాటికి ఈ రెండు నియోజకవర్గాల్లో కలిపి 30,406 మంది ఓటర్లు ఉండగా, ఈనెల 7 నాటికి ఓటు నమోదుకు 27,397 మంది దరఖాస్తు చేసుకున్నారు.వీరిలో ఉభయ గోదావరి నియోజకవర్గం నుంచి 12,529 మంది, కృష్ణా-గుంటూరు నియోజకవర్గం నుంచి 14,868 మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఫలించిన మంత్రి కొండపల్లి వ్యూహం.. బొత్స కూతురిపై సామాన్య మహిళ గెలుపు..