Year Ender 2025 ODI runs: ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా బ్యాటర్లు వీరే..
ABN , Publish Date - Dec 25 , 2025 | 09:06 PM
2025లో టీమిండియా మొత్తం మీద 14 వన్డేలు ఆడింది. వాటిలో 11 మ్యాచ్‌ల్లో గెలిచి, కేవలం మూడింటిలో మాత్రమే ఓడిపోయింది. ఈ విజయాల్లో టీమిండియా బ్యాటర్లదే కీలక పాత్ర అని చెప్పక తప్పదు. ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా టాప్ ఫైవ్ బ్యాటర్లు ఎవరో చూద్దాం
ఈ ఏడాది వన్డే ఫార్మాట్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. స్వదేశంలోనూ, విదేశాల్లోనూ నిలకడగా రాణించి భారీ విజయాలు సాధించింది. దుబాయ్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ సాధించింది. పలు ద్వైపాక్షిక సిరీస్‌లు నెగ్గింది. 2025లో టీమిండియా మొత్తం మీద 14 వన్డేలు ఆడింది. వాటిలో 11 మ్యాచ్‌ల్లో గెలిచి, కేవలం మూడింటిలో మాత్రమే ఓడిపోయింది. ఈ విజయాల్లో టీమిండియా బ్యాటర్లదే కీలక పాత్ర అని చెప్పక తప్పదు. ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా టాప్ ఫైవ్ బ్యాటర్లు ఎవరో చూద్దాం (most ODI runs for India 2025)..
1) విరాట్ కోహ్లీ:

విరాట్ కోహ్లీ ఈ ఏడాది వన్డే ఫార్మాట్‌లో అమోఘంగా రాణించాడు. 37 ఏళ్ల ఈ ఆటగాడు 13 ఇన్నింగ్స్‌లలో 651 పరుగులు సాధించి, ఈ ఏడాది భారత తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ ఏడాది కోహ్లీ ఖాతాలో మూడు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కోహ్లీ తన వన్డే సెంచరీల సంఖ్యను 53కి తీసుకెళ్లాడు (Virat Kohli ODI runs).
2) రోహిత్ శర్మ:

కోహ్లీ కంటే రోహిత్ శర్మ ఈ ఏడాది ఒక్క పరుగు మాత్రమే తక్కువగా చేశాడు. రోహిత్ ఈ ఏడాది 14 ఇన్నింగ్స్‌లలో 650 పరుగులు సాధించి, ఈ ఏడాది భారత తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. వాటిల్లో రెండు సెంచరీలు, నాలుగు అర్ధ సెంచరీలు చేశాడు. రోహిత్ నాయకత్వంలోనే టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది (Rohit Sharma ODI performance).
3) శ్రేయస్ అయ్యర్:

కోహ్లీ, రోహిత్ తర్వాత శ్రేయస్ అయ్యర్ టీమిండియాకు కీలక వన్డే ఆటగాడిగా నిలిచాడు. మిడిలార్డర్‌లో నమ్మదగ్గ బ్యాటర్ అనిపించకున్నాడు. అయ్యర్ ఈ ఏడాది 11 ఇన్నింగ్స్‌లలో 496 పరుగులతో మూడో స్థానంలో నిలిచాడు. అతడి సగటు 50కి దగ్గరగా ఉండడం విశేషం.
4) శుభ్‌మన్ గిల్:

శుభ్‌మన్ గిల్ కూడా ఈ ఏడాది చక్కగా రాణించాడు. ఈ ఏడాది గిల్ 11 మ్యాచ్‌ల్లో 490 పరుగులు చేశాడు. వాటిల్లో రెండు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఈ ఏడాది గిల్ టీమిండియాకు పూర్తి స్థాయి వన్డే, టెస్ట్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.
5) కేఎల్ రాహుల్:

కేఎల్ రాహుల్ కూడా ఈ ఏడాది బ్యాట్‌తో మెరుగైన ప్రదర్శన చేశాడు. రాహుల్ ఈ ఏడాది 14 మ్యాచ్‌ల్లో 367 పరుగులు చేసి టాప్ ఫైవ్‌లోకి వచ్చాడు. బ్యాటింగ్ లైనప్‌లో కిందకు వచ్చి కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు.
ఇవి కూడా చదవండి..
కుక్కలు ఎప్పుడూ బైక్‌లు, కార్ల వెంట ఎందుకు పరిగెడతాయి.. అసలు కారణమేంటి..
మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ ఫొటోలో పిల్లి ఎక్కడుందో 7 సెకెన్లలో కనిపెట్టండి..