Share News

Google Health Trends 2025: గూగుల్‌ హెల్త్ ట్రెండ్స్.. లక్షల మంది సెర్చ్ చేసిన వ్యాధులు ఇవే..

ABN , Publish Date - Dec 22 , 2025 | 03:51 PM

2025లో ఆరోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన పెరిగింది. చిన్న లక్షణాలైనా సరే, ముందుగా గూగుల్‌లో తెలుసుకునే అలవాటు భారతీయుల్లో పెరిగింది. ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేసిన వ్యాధులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..

Google Health Trends 2025: గూగుల్‌ హెల్త్ ట్రెండ్స్.. లక్షల మంది సెర్చ్ చేసిన వ్యాధులు ఇవే..
Google Health Trends 2025

ఇంటర్నెట్ డెస్క్: 2025లో భారతీయులు ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం కోసం గూగుల్‌ను ప్రధానంగా ఉపయోగించారు. చిన్న తలనొప్పి నుంచి జ్వరం, చేతులు–కాళ్లలో తిమ్మిరి లేదా అకస్మాత్తుగా వచ్చే కడుపు నొప్పి వరకు ఏ సమస్య వచ్చినా, ముందుగా గూగుల్‌లో లక్షణాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. వైద్యుడిని సంప్రదించే ముందు తమ శరీరంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలనే ఆసక్తి దీనికి కారణంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో 2025లో భారతీయులు గూగుల్‌లో ఎక్కువగా శోధించిన వ్యాధులు ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం..


జ్వరం

శరీర ఉష్ణోగ్రత 98.6°F కంటే ఎక్కువైనప్పుడు జ్వరం వస్తుంది. సాధారణంగా ఇన్ఫెక్షన్ లేదా శరీరానికి రుగ్మతలకు ప్రతిస్పందనగా వస్తుంది.

తలనొప్పి

ఒత్తిడి, సైనస్ సమస్యలు లేదా మైగ్రేన్ వంటి కారణాల వల్ల తలనొప్పి కలుగుతుంది. సాధారణ తలనొప్పి తేలికగా ఉంటుంది. కానీ, మైగ్రేన్ తలనొప్పి తీవ్రంగా ఉంటుంది.

Headach.jpg

దగ్గు

శ్వాస మార్గాలను శుభ్రం చేయడానికి శరీరం చేసే ప్రక్రియ దగ్గు. పొడి దగ్గు అలెర్జీలు, వైరల్ ఇన్ఫెక్షన్‌తో వస్తుంది. శ్లేష్మం ఉన్న దగ్గు శ్వాసకోశ సమస్యలకు సూచనగా వస్తుంది.


అలసట

నిద్ర రుగ్మతలు, రక్తహీనత, దీర్ఘకాలిక అలసట సిండ్రోమ్, గుండె సమస్యలు లేదా క్యాన్సర్ కారణంగా కలుగుతుంది.

గొంతు నొప్పి

సాధారణంగా గొంతు నొప్పి తేలికగా ఉంటుంది. COVID-19, జలుబు లేదా అలెర్జీలు కారణం కావచ్చు. దీర్ఘకాలిక గొంతు నొప్పికి వైద్య సలహా అవసరం.

Thought.jpg

ఊపిరి ఆడకపోవడం

ఆస్తమా, COPD, న్యుమోనియా లేదా గుండె సమస్యలకు సంకేతం ఊపిరి ఆడకపోవడం. ఇది తీవ్రమైనది కాబట్టి లక్షణాలను గమనించి చికిత్స తిసుకోవడం అవసరం.


ముక్కు దిబ్బడ

జలుబు, అలెర్జీలు లేదా సైనస్ ఇన్ఫెక్షన్ కారణంగా ముక్కు దిబ్బడ వస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు అలెర్జీ రినిటిస్ లేదా సైనసిటిస్‌కు దారితీస్తుంది.

చెస్ట్ పెయిన్

గుండె సమస్యలతో సంబంధం ఉండకపోయినా పల్మనరీ సమస్యలు లేదా ఇతర పరిస్థితులకు చెస్ట్ పెయిన్ సంకేతం.

chest Pain.jpg

కడుపు నొప్పి

కడుపు నొప్పి పిల్లలలో సాధారణం. కానీ పెద్దల్లో జీర్ణ సమస్యలు, ఇన్ఫెక్షన్, అపెండిసైటిస్, IBS సూచనగా వస్తుంది.


వికారం

ఫుడ్ పాయిజనింగ్, మోషన్ సిక్‌నెస్, మైగ్రేన్ లేదా అపెండిసైటిస్ లక్షణాలు.

విరేచనలు

వైరల్ ఇన్ఫెక్షన్, ఆహార అలెర్జీలు, IBS లేదా IBD కారణంగా వస్తాయి.

శరీర నొప్పులు

శరీర నొప్పులు అనేవి కండరాల ఒత్తిడి, అలసట, జలుబు, ఫ్లూ వంటి సాధారణ కారణాల వల్ల రావచ్చు లేదా దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కూడా రావచ్చు.

Body Pains.jpg


జుట్టు రాలడం

జన్యుశాస్త్రం, ఒత్తిడి, హార్మోన్లు లేదా థైరాయిడ్ సమస్యలు కారణంగా జుట్టు రాలిపోతుంది. పోషక లోపాలు, పర్యావరణం, మందులు కూడా దీనికి కారణం కావచ్చు.

చర్మ దద్దుర్లు

అలెర్జీలు, ఇన్ఫెక్షన్లు, సోరియాసిస్ వంటి సమస్యల కారణంగా చర్మ దద్దుర్లు వస్తాయి. దద్దుర్లు అదే పనిగా ఉంటే వైద్యులను సంప్రదించాలి.

బరువు తగ్గడం / పెరగడం

బరువులో మార్పు అనేది జీవక్రియ రుగ్మతలు, క్యాన్సర్, థైరాయిడ్ సమస్యల సూచన. అధిక బరువు సమస్య జీవనశైలి, హార్మోన్లు లేదా మందుల కారణంగా వస్తుంది.

Weight.jpg


ఒత్తిడి

సామాన్య ఒత్తిడి, ఆందోళన, గాయాలు, వైద్య పరిస్థితుల కారణంగా ఒత్తిడి కలుగవచ్చు. అధిక ఒత్తిడి శారీరక లక్షణాలను కలిగిస్తుంది.

నిద్ర సమస్యలు

ఒత్తిడి, ఆందోళన, జీవనశైలి కారణంగా నిద్ర సమస్యలు వస్తాయి. దీర్ఘకాలికంగా ఇది అనేక రకాల సమస్యలకు దారితీస్తుంది

ఈ విధంగా, 2025లో భారతీయులు ఎక్కువగా గూగుల్‌లో శోధించిన లక్షణాలు ఆరోగ్యంపై వారి అవగాహన పెరుగుతోందని చూపిస్తున్నాయి. చిన్న సమస్యలకే కాక, ముఖ్యమైన ఆరోగ్య సమస్యలపై కూడా ప్రజలు ముందుగా సమాచారం తెలుసుకోవాలని ఆసక్తి చూపుతున్నారు.


(Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతుంది. కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధృవీకరించలేదు )

Also Read:

పూజకు ఏ వస్తువులను తిరిగి ఉపయోగించకూడదో తెలుసా?

తగ్గాలనుకుంటున్నారా? ఉదయాన్నే ఈ 3 పనులు చేయండి.!

For More Latest News

Updated Date - Dec 22 , 2025 | 04:17 PM