బంగ్లాదేశ్ సరిహద్దుల్లో హై అలర్ట్..
ABN, Publish Date - May 01 , 2025 | 01:20 PM
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో మరిన్ని అలజడులు సృష్టించేందుకు పాకిస్థాన్ ప్రయత్నించే అవకాశాలున్నాయని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆ క్రమంలో పొరుగునున్న బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దుల వద్ద సైతం భద్రతను
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో మరిన్ని అలజడులు సృష్టించేందుకు పాకిస్థాన్ ప్రయత్నించే అవకాశాలున్నాయని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆ క్రమంలో పొరుగునున్న బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దుల వద్ద సైతం భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని సైనిక అధికారులను నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి. బంగ్లాదేశ్‌లో కొలువు తీరిన మహ్మద్ యూనస్ సర్కార్.. పాకిస్థాన్‌తో స్నేహ సంబంధాలను కొనసాగిస్తోంది. అదీకాక బంగ్లాదేశ్‌లోని తీవ్రవాద వర్గాలతో సంబంధాలు బలోపేతం చేసుకొనేందుకు పాకిస్థాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోందని స్పష్టం చేశాయి. దీంతో బంగ్లాదేశ్‌ను స్థావరంగా చేసుకొని ఈ తీవ్రవాద గ్రూప్‌ల ద్వారా భారత్‌లో అలజడులు రేపే అవకాశముందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ సరిహద్దు ప్రాంతంలో గస్తీని మరింత పెంచాలని సైనిక అధికారులను నిఘా వర్గాలు సూచించాయి.
Updated at - May 01 , 2025 | 01:20 PM