వివేకా కేసులో మూడోసారి విచారణ.. రూ. 20 కోట్లపై ఆరా

ABN, Publish Date - Oct 22 , 2025 | 02:10 PM

వైఎస్ వివేకా హత్య కేసులో కడప సెంట్రల్ జైల్లో మూడోసారి విచారణ జరుగుతుంది. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఎదుట విచారణకు దస్తగిరి, అతని భార్య షబానా, టీడీపీ నేత బిటెక్ రవి హాజరయ్యారు.

వైఎస్ వివేకా హత్య కేసులో కడప సెంట్రల్ జైల్లో మూడోసారి విచారణ జరుగుతుంది. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఎదుట విచారణకు దస్తగిరి, అతని భార్య షబానా, టీడీపీ నేత బిటెక్ రవి హాజరయ్యారు. కడప జైల్లో ఉన్న వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడు దస్తగిరిని మరో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి కలిసి.. రూ. 20 కోట్లు తీసుకుని తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై దస్తగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై ఏర్పాటు చేసిన విచారణ కమిటీ.. దీనిపై మరోసారి విచారిస్తుంది.

ఈ వీడియోలు కూడా వీక్షించండి..

అయ్యప్ప స్వామిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఏఆర్ కానిస్టేబుల్ వీరంగం..పెట్రోల్ బంక్ సిబ్బందిపై దా*డి

మరిన్నీ వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Oct 22 , 2025 | 02:11 PM