కేంద్ర మంత్రి కాన్వాయ్‌కు ప్రమాదం ..

ABN, Publish Date - Jan 30 , 2025 | 01:50 PM

విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి స్టీల్‌ ప్లాంట్‌కు కేంద్రమంత్రులు వెళ్తున్న సమయంలో స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది. షీలా నగర్‌ వద్ద మంత్రుల కాన్వాయ్‌లోని ఒక కారు సడన్‌ బ్రేక్ వేయడంతో ఆ వెనకే వస్తున్న మూడు కార్లు ఒకదానితో ఒకటి ఢీకొని స్వల్పంగా దెబ్బ తిన్నాయి. దెబ్బతిన్న వాటిలో మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహ రావు వెహికల్ కూడా ఉంది.

విశాఖ: నగరంలో కేంద్రమంత్రులు కుమారస్వామి, శ్రీనివాసవర్మ పర్యటనలో ప్రమాదం జరిగింది. షీలానగర్ వద్ద కాన్వాయ్‌లో మూడు కార్లు ఒకదానితో మరొకటి ఢీ కొన్నాయి. ఎయిర్ పోర్టు నుంచి స్టీల్ ఫ్లాంట్‌కు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ధ్వంసమైన వాటిలో మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు కారు కూడా ఉంది. ఈ ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అనంతరం నేతలు వేరే కార్లలో స్టీల్‌ ప్లాంట్‌కు బయలుదేరి వెళ్లారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

ఈ వార్త కూడా చదవండి..

ఏపీలో ‘వాట్సాప్ పాలన’ ప్రారంభించిన మంత్రి లోకేష్


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీలో ‘వాట్సాప్ పాలన’ ప్రారంభించిన మంత్రి లోకేష్..

కడపలో శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

వేములవాడలో బీభత్సం సృష్టించిన లారీ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jan 30 , 2025 | 01:50 PM