తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయా.. విచారణలో వంశీ తీరు!

ABN, Publish Date - Feb 26 , 2025 | 09:52 PM

తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయా.. ఇది సినిమాలో విన్న డైలాగ్‌లా ఉంది కదా. ఇప్పుడు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీసుల విచారణలో తరచూ చెబుతున్న మాటలు ఇవి. ఆధారాలు చూపించి అడిగినా.. స్టేట్‌మెంట్లు చదవి వినిపించినా.. ఆయన మాత్రం చెవికెక్కించుకోవడం లేదు. వంశీని మూడు రోజుల కస్టడీకి ఇస్తూ విజయవాడ ఎస్సీ, ఎస్టీ ఆట్రాసిటీ ప్రత్యేక కోర్టు పోలీసులకు అనుమతి ఇచ్చింది.

తొలి రోజు రెండున్నర గంటల పాటు విచారణలో పలు ప్రశ్నలకు సమాధానాలను వంశీ దాటవేసినట్లు తెలుస్తోంది. రెండో రోజు వంశీని 10 గంటల లోపే.. జైలు నుంచి పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో విచారించారు. ఈ సందర్భంగా కొన్ని అంశాలపై మాత్రమే వంశీ జవాబు చెప్పారు. మరికొన్ని అంశాల్లో మాత్రం తెలియదు.. గుర్తు లేదు..మరిచి పోయానంటూ సమాధానం ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Feb 26 , 2025 | 10:30 PM