అమెరికా యుద్ధవిమానం లో సంకెళ్లతో ఇండియాకు వలసదారులు
ABN, Publish Date - Feb 05 , 2025 | 09:56 PM
డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రాగానే వలస దారులపై ఉక్కు పాదం మోపిన అమెరికా ప్రభుత్వం.. కొంత మంది భారతీయులను సైతం వెనక్కి పంపుతోంది. చట్ట వ్యతిరేకంగా అగ్రరాజ్యంలో అడుగు పెట్టిన వారిని సొంత విమానాంలో స్వదేశానికి పంపింది. అయితే వలసదారుల చేతులకు సంకెళ్లు వేసి పంపడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రాగానే వలస దారులపై ఉక్కు పాదం మోపిన అమెరికా ప్రభుత్వం.. కొంత మంది భారతీయులను సైతం వెనక్కి పంపుతోంది. చట్ట వ్యతిరేకంగా అగ్రరాజ్యంలో అడుగు పెట్టిన వారిని సొంత విమానాంలో స్వదేశానికి పంపింది. అయితే వలసదారుల చేతులకు సంకెళ్లు వేసి పంపడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అమెరికా సైనిక విమానంలో వచ్చిన వారంతా.. పంజాబ్ దాని చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన వారేనని తెలుస్తోంది. అయితే వీరినీ అదుపులోకి తీసుకునేందుకు స్వదేశంలో ఎలాంటి ఆదేశాలు లేవని సమాచారం. అవసరమైన తనిఖీల అనంతరం ఎయిర్ పోర్టు నుంచి వారిని బయటకు పంపనున్నట్లు సమాచారం. ఇక వెనక్కి పంపే ముందు ప్రతి ఒక్కరి రికార్డులను పరిశీలించనున్నట్లు ఢిల్లీలోని అమెరికన్ ఎంబెసీ వెల్లడించింది. అలాగే రానున్న రోజుల్లో మరిన్ని విమానాలు భారత్ రానున్నాయని అమెరికా అధికారులు వెల్లడించారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Feb 05 , 2025 | 09:59 PM