శ్రీవారి భక్తులకు శుభవార్త

ABN, First Publish Date - 2025-04-01T16:46:58+05:30 IST

Tirumala Darshan Tokens: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పింది. వృద్ధులు, దివ్యాంగులకు శ్రీవారి దర్శనం విషయంలో పాత ఆఫ్‌లైన్ విధానాన్ని పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకుంది టీటీడీ.

తిరుమల, ఏప్రిల్ 1: తిరుమల వెంకటేశ్వరుడి దర్శనం విషయంలో వృద్ధులు, దివ్యాంగులకు ఇబ్బందులు తొలగించేలా టీటీడీ (TTD) నిర్ణయం తీసుకుంది. వీరికి జారీ చేసే దర్శన టోకెన్లను ఆన్‌లైన్‌కు మాత్రమే పరిమితం చేసిన గత అధికారుల నిర్ణయాన్ని మారుస్తూ టీటీడీ బోర్డు తాజాగా తీర్మానం చేసింది. పాత ఆఫ్‌లైన్ విధానాన్ని కూడా పునరుద్ధరించాలని నిర్ణయించింది. దీంతో నాలుగేళ్ల తర్వాత ఆఫ్‌లైన్ టోకెన్ల ద్వారా కూడా దర్శన భాగ్యం లభించనుంది. 65 ఏళ్ల వయస్సు పైబడిన వృద్ధులతో పాటు శారీరక, మానసికవైకల్యం, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న భక్తులకు కోవిడ్ ముందు వరకు టీటీడీ రోజుకు 1400 మందికి దర్శనం చేయించేది. కానీ కోవిడ్ నేపథ్యంలో ప్రత్యేక దర్శనాలతో పాటు ఈ విధానాన్ని కూడా టీటీడీ రద్దు చేసింది.


కరోనా ప్రభావం తగ్గిన తర్వాత 2021, ఏప్రిల్ 9 నుంచి పునరుద్ధరించింది. అయితే టోకెన్ల కోసం భక్తులు భారీగా రావడం, కోటా పూర్తి అయిన తర్వాత నిరసన వ్యక్తం చేస్తుండటంతో కోవిడ్ సమయంలో గుంపులుగా ఉండటం సరికాదనే కారణంతో కరెంట్ బుకింగ్‌ను అప్పట్లో రద్దు చేశారు. అప్పటి నుంచి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్ల తరహాలో ఈ టోకెన్లను ఆన్‌లైన్‌లోనే బుక్‌ చేసుకోవాలని నిబంధన పెట్టారు. ఈ క్రమంలో ఎలాంటి దర్శన టికెట్లు, టోకెన్లు లేకుండా తిరమలకు వచ్చే వృద్ధులు, దివ్యాంగులు సర్వదర్శనం క్యూలైన్లోకి వెళ్లలేక తిరిగి వెళ్లిపోతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.


ఇవి కూడా చదవండి

HCU Land Politics:హెచ్‌సీయూ భూముల వివాదంపై రాజకీయ రగడ


Kakani Bail Petition: కాకాణి బెయిల్ పిటిషన్‌పై హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు

Read Latest AP News And Telugu News

Updated at - 2025-04-01T16:47:03+05:30