Adiyogi statue: ఆంధ్రా శబరిమలలో అతి పెద్ద ఆది యోగి విగ్రహం.!

ABN, Publish Date - Feb 25 , 2025 | 06:31 PM

ద్వారపూడి గ్రామంలో కనకరాజ్ నగర్‌లో ఆంధ్రశబరిమలగా పేరుగాంచిన అయ్యప్ప స్వామి ప్రాంగణంలో అష్టదశ శ్రీ ఉమా విశ్వలింగేశ్వర స్వామి ఆలయానికి దక్షణ భాగంలో ఆదియోగి విగ్రహా నిర్మాణ కార్యక్రమం బారీ స్థాయిలో జరుగుతోంది.

ద్వారపూడిలోని ఆంధ్ర శబరిమల ఆలయాన్ని1983 మార్చి24 వ తేదీన శంకుస్థాపన చేశారు.1989 జూన్ 25వ తేదీన అయ్యప్ప స్వామి విగ్రహా ప్రతిష్ఠ చేశారు. గురుస్వామి కనకరాజు స్వామి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. కంచి కామకోఠి పీఠాధిపతి జగద్గురువు జయేంద్ర సరస్వతి స్వామి చేతులమీదుగా అయ్యప్ప స్వామి విగ్రహా ప్రతిష్ఠ జరిగింది. అయ్యప్ప స్వామి ఆలయంలో పంచముఖి గణపతి ఆలయం, సుబ్రహ్మణ్య స్వామి, కనకదుర్గమ్మ ఆలయం, సద్గురు సాయిబాబా ఆలయం, అష్టాదశ శ్రీ ఉమా విశ్వలింగేశ్వర ఆలయం, అంకాలమ్మ, నాగదేవత, ఆత్మలింగ, లక్ష్మీకుబేర, పాతాళ భూ గ్రహ ద్వాదశ జ్యోతిర్లింగ దివ్యా దేవాలయం, శ్రీదేవి భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి, తదితర దేవాలయాలు ఉన్నాయి.


మొదటగా అయ్యప్ప స్వామి ఆలయం నిర్మించారు. ఆ తర్వాత పలు దేవాలయాలు పూర్తి చేశారు. ప్రతి రోజూ ఉదయం స్వామి వారికి అభిషేకం, అర్చన కార్యక్రమాలు జరుగుతాయి. అయ్యప్ప స్వామికి 18 రకాల అభిషేకాలను బ్రాహ్మణులు చేస్తుంటారు. ఇక్కడ కేరళ నంబూద్రి వారి చేత పూజలు నిర్వహిస్తారు. సంతానం లేని వారు అయ్యప్ప స్వామికి అభిషేకం చేయిస్తే సంతానం కలుగుతుందని ఆలయంలో ఉండే బ్రాహ్మణులు, భక్తులు చెబుతున్నారు. కార్తీక మాసంలో భక్తులు అయ్యప్ప మాల వేసుకుంటారు. మాలాధారణ సమయం అయిపోయన తర్వాత ఇక్కడనే ఇరుముడులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. మొక్కలు తీరిన తర్వాత భక్తులు ఇక్కడ తులాభారం ఇస్తుంటారు.


ద్వారపూడి గ్రామంలో కనకరాజ్ నగర్‌లో ఆంధ్రశబరిమలగా పేరుగాంచిన అయ్యప్ప స్వామి ప్రాంగణంలో అష్టదశ శ్రీ ఉమా విశ్వలింగేశ్వర స్వామి ఆలయానికి దక్షణ భాగంలో ఆదియోగి విగ్రహా నిర్మాణ కార్యక్రమం బారీ స్థాయిలో జరుగుతోంది. ఫిబ్రవరి26 వ తేదీ (మహా శివరాత్రి) బుధవారం ఉదయం 7: 30లకు గురుదేవులు కనకరాజు గురుస్వామి ఆధ్వర్యంలో ఆదికవి విగ్రహా ప్రతిష్ఠ , శివలింగ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బ్రాహ్మణులు తెలిపారు. 100 అడుగుల వెడల్పు, 60 అడుగుల ఎత్తులో ఆదియోగి విగ్రహాన్ని రూపొందించారు. ద్వారపూడిలో ఏర్పాటు చేసిన ఆదియోగి విగ్రహం భారతదేశంలో రెండవదని బ్రాహ్మణులు చెప్పారు. ఆదియోగి విగ్రహం లోపల శివలింగం ప్రతిష్ఠ జరుగుతోందని తెలిపారు. ఆదియోగి విగ్రహం లోపల భక్తులు కూర్చోని ధ్యానం చేసే విధంగా ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు వెల్లడించారు.


మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Feb 25 , 2025 | 06:32 PM