తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం

ABN, Publish Date - Nov 26 , 2025 | 08:37 AM

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. అధికార కాంగ్రెస్ పంచాయతీ ఎన్నికల్లో 90 శాతం స్థానాలను కైవసం చేసుకోవాలని కసరత్తు చేస్తోంది. ప్రజాపాలన ఉత్సవాలు కాంగ్రెస్ పార్టీకి కలిసివస్తాయని నేతలు చెబుతున్నారు.

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ సైతం విడుదలైంది. ఇక ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. అధికార కాంగ్రెస్ పంచాయతీ ఎన్నికల్లో 90 శాతం స్థానాలను కైవసం చేసుకోవాలని కసరత్తు చేస్తోంది. ప్రజాపాలన ఉత్సవాలు కాంగ్రెస్ పార్టీకి కలిసివస్తాయని నేతలు చెబుతున్నారు. డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన ఉత్సవాలను కాంగ్రెస్ పార్టీ నిర్వహించనుంది. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల గురించి ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాలని కాంగ్రెస్ వ్యూహరచన చేసిందని సమాచారం. ఇప్పటికే మహిళలకు చీరల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించి సంగతి తెలిసిందే. డిసెంబర్ 9 లోపు చీరల పంపిణీ పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు సైతం జారీ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆర్టీసీ బస్సులో పొగలు.. ఏమైందంటే..

ఏపీలో భారీ అగ్నిప్రమాదం.. బ్యాంకులో ఒక్కసారిగా మంటలు..

Updated at - Nov 26 , 2025 | 08:37 AM