Revanth Reddy OU: మానవ మృగాలు ఫామ్ హౌస్‌లో ఉన్నాయి..సీఎం రేవంత్ రెడ్డి
ABN, Publish Date - Aug 25 , 2025 | 01:49 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్, కేటీఆర్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో మానవ మృగాలు ఫామ్ హౌస్‌లో ఉన్నాయని, వారి పాలన, ప్రవర్తనను తీవ్రంగా విమర్శించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy).. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్‌లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మానవ మృగాలు ఫామ్ హౌస్‌లో ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి, అక్రమ లావాదేవీలు జరిగాయని, ఫామ్ హౌస్‌లు అవినీతి కేంద్రాలుగా మారాయని ఆరోపించారు. ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోకుండా వ్యక్తిగత స్వార్థ లాభాలకు ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు. తమ ప్రభుత్వం పారదర్శకంగా, నిజాయితీగా పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Updated at - Aug 25 , 2025 | 01:49 PM