ఏడవ రోజుకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ABN, First Publish Date - 2025-03-22T10:49:36+05:30 IST
Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడవ రోజు మొదలయ్యాయి. రాష్ట్రంలోని పలు సమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇవ్వనున్నారు.
హైదరాబాద్, మార్చి 22: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Telangana Assembly Session) ఏడవ రోజుకు చేరుకున్నాయి. సభ మొదలవగానే స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. సరూర్నగర్ చెరువు సుందరీ కరణ, రాష్ట్రంలో దళిత విశ్వవిద్యాలయం ఏర్పాటు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపు, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో రహదారుల నిర్మాణం, ఎల్లంపల్లి మరియు గోదావరిఖని పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి, మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాల పెంపు,పట్టణాలు మరియు నగరాలకు బాహ్య వలయ రహదారులు, రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధి, కల్వకుర్తి నియోజకవర్గం లో గ్రామ పంచాయతీలు.. తండాలకు వీటి రోడ్ల మంజూరుకు సంబంధించి ప్రశ్నోత్తరాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది.
అలాగే ఈరోజు సభలో నాలుగు పద్దులపై చర్చ జరుగనుంది. పశుసంవర్ధక , శాఖ , ఫిషరీస్, కార్మిక ఉపాధి శాఖల పద్దు, అగ్రికల్చర్ మార్కెటింగ్ కోపరేషన్ అండ్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ పద్దుపై, ఆరోగ్యశాఖ వద్దు పై చర్చ, రవాణా, బీసీ సంక్షేమ శాఖ పద్దుపై చర్చ జరుగనుంది. పద్దులపై చర్చ కారణంగా శాసనమండలి సమావేశాలు ఈనెల 27 తేదీకి వాయిదా పడింది.
ఇవి కూడా చదవండి..
IPL 2025: ఐపీఎల్‌లో ఫిక్సింగ్ బ్యాటింగ్ మాఫియా కుట్రనా
Worlds most Expensive Mango: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండు.. కిలో రూ.3 లక్షలు
Read Latest Telangana News And Telugu News
Updated at - 2025-03-22T10:49:44+05:30