ఆ ముగ్గురికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడానికి కారణం ఇదే

ABN, Publish Date - Mar 09 , 2025 | 08:46 PM

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థుల ఎంపికలో టీడీపీ అగ్రనేతలు చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లా నుంచి కావలి గ్రీష్మ, దక్షిణ కోస్తా ప్రాంతంలోని నెల్లూరు జిల్లాకు చెందిన బీదా రవిచంద్ర, చిత్తూరు జిల్లాకు చెందిన బీటీ నాయుడులను ఎంపిక చేశారు.

అమరావతి, మార్చి 09: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థుల ఎంపికలో టీడీపీ అగ్రనేతలు చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లా నుంచి కావలి గ్రీష్మ, దక్షిణ కోస్తా ప్రాంతంలోని నెల్లూరు జిల్లాకు చెందిన బీదా రవిచంద్ర, చిత్తూరు జిల్లాకు చెందిన బీటీ నాయుడులను ఎంపిక చేశారు. గత జగన్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కావలి గ్రీష్మ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ క్రమంలో వైసీపీపై ఆమె వీరోచితంగా పోరాటం చేశారు. అందులోభాగంగా కేసులను సైతం ఆమె ఎదుర్కొన్నారు. మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతీ కుమార్తె అయిన గ్రీష్మ.. జిల్లాలో తెలుగు దేశం పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించారు.


ఇక బీదా రవిచంద్ర అయితే.. తన సోదరుడు బీదా మస్తాన్ రావు.. వైసీపీతోపాటు ఆ పార్టీ రాజ్య సభ సభ్యత్వానికి రాజీనామా చేసి.. టీడీపీలో చేరడంతో ప్రధాన పాత్ర పోషించారు.


అలాగే బీటీ నాయుడు.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నాటి ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైల్లో ఉంచారు. ఆ సమయంలో.. ప్రతి రోజు ఉదయం సాయంత్రం చంద్రబాబును కలవడం.. ఆయన చెప్పిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించడం, అలానే ఆయన క్షేమ సమాచారాలను సైతం పార్టీ కేడర్‌కు తెలియజేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇటువంటి పరిస్థితుల్లో తన పదవిని మరోసారి రెన్యువల్ చేయాలంటూ బీటీ నాయుడు సీఎం చంద్రబాబును కలిసి కోరారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవి ముగిసిపోతున్న బీటీ నాయుడుకు మరోసారి ఎమ్మెల్సీ పదవి వరించినట్లు అయింది.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Mar 09 , 2025 | 08:46 PM