టెలీకాలర్ ప్రశ్నకు.. ఎమ్మెల్యే ఫన్నీ ఆన్సర్

ABN, First Publish Date - 2025-02-26T15:38:15+05:30 IST

Kunaravikumar: టెలీకాలర్‌కు టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ మధ్య జరిగిన సరదా సంభాషణ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. టెలీకాలర్‌ అడిగిన పలు ప్రశ్నలకు ఎమ్మెల్యే ఇచ్చిన సమాధానాలు ఫన్నీగా అనిపించాయి.

అమరావతి, ఫిబ్రవరి 26: టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు (MLA Kuna Ravi Kumar) ఓ టెలీకాలర్‌‌కు మధ్య సరదా సంభాషణ జరిగింది. ఎమ్మెల్యే తన అనుచరులతో ఉన్న సమయంలో టెలీకాలర్ ఫోన్ చేసింది. ఎమ్మెల్యే కాల్ లిఫ్ట్‌ చేయగానే మీ పేరు ఏంటని మహిళ ప్రశ్నించింది. అప్పటికే ఇదొక ఐవీఆర్‌ఎస్ కాల్‌గా గుర్తించిన ఎమ్మెల్యే మాటలు కలిపారు. తన పేరు చెప్పి మీకేం కావాలని అడిగారు. అప్పుడు ఫోన్ చేసిన మహిళ మీ ఎమ్మెల్యే పని తీరుపై అభిప్రాయాలు చెప్పండి అని అడిగింది. దీనికి జవాబుగా ఎమ్మెల్యే పనితీరు బాగోలేదని సమాధానం ఇచ్చారు. దీంతో పక్కనే ఉన్న కూన రవికుమార్ అనుచరులు ఈ సంభాషణను చూసి నవ్వుకున్నారు.


ఇవి కూడా చదవండి...

Komatireddy Venkatreddy: వారి క్షేమం కోసం మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేక పూజలు

Vamsi in police custody: రెండో రోజు వంశీ విచారణ.. కీలక అంశాలపై ప్రశ్నలు

Read Latest Telangana News And Telugu News

Updated at - 2025-02-26T15:54:22+05:30