ప్రాణం తీస్తున్న వాయు కాలుష్యం
ABN , Publish Date - Mar 12 , 2025 | 09:52 PM
దేశంలోని చిన్న చిన్న పట్టణాలు మొదలుకొని నగరాల వరకూ కాలుష్యం పెరిగిపోతోంది. పారిశ్రామికీకరణ పెరిగిపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. గాలి నాణ్యత పూర్తిగా పడిపోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దేశంలోని చిన్న చిన్న పట్టణాలు మొదలుకొని నగరాల వరకూ కాలుష్యం పెరిగిపోతోంది. పారిశ్రామికీకరణ పెరిగిపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. గాలి నాణ్యత పూర్తిగా పడిపోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కర్బన ఉద్గారాల విడుదల ఆందోళనకర స్థాయికి చేరింది. స్విస్ ఎయిర్ క్వాలిటీ కంపెనీ అయిన ఐక్యూ.. వాయు కాలుష్యంపై రూపొందించిన ద వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024 నివేదికను విడుదల చేశారు. ఇందులో ప్రపంచంలో అత్యధికంగా కాలుష్యం వెలువడే 20 నగరాల్లో 13 నగరాలు భారత్‌లోనే ఉన్నట్లు తేలింది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య పట్టణంగా అసోంలోని బైర్నీహాట్ పట్టణం తొలి స్థానంలో నిలిచింది. ఈ ప్రాంతంలో ఐరన్, స్టీల్, సిమెంట్ ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉన్నాయి. దీనికితోడు హెవీ ట్రాన్స్‌పోర్టు లారీలు కూడా వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయి.