హోగన్..ఒళ్లంతా సర్జరీలే
ABN, Publish Date - Jul 25 , 2025 | 09:56 PM
డబ్ల్యుడబ్ల్యు రెజ్లర్ హల్క్ హొగన్. ఈ రోజు ఆయన మనతో లేరు. 2025, జులై 24వ తేదీన మృతి చెందారు. చూడడానికి భారీ కాయంతో ఉండే ఆయన.. రెజ్లింగ్ రింగ్‌లోకి దిగారంటే ప్రత్యర్థులు భయపడాల్సిందే..
డబ్ల్యుడబ్ల్యు రెజ్లర్ హల్క్ హొగన్. ఈ రోజు ఆయన మనతో లేరు. 2025, జులై 24వ తేదీన మృతి చెందారు. చూడడానికి భారీ కాయంతో ఉండే ఆయన.. రెజ్లింగ్ రింగ్‌లోకి దిగారంటే ప్రత్యర్థులు భయపడాల్సిందే.. అంతేకాదు ఆయన అభిమానులకు కావాల్సినంత వినోదం. డబ్ల్యు డబ్ల్యుఎఫ్ ప్రపంచంలోనే ఆయన వేసిన ముద్ర అంతా ఇంతా కాదు. అందుకే ఆయన రెజ్లింగ్ లెజెండ్‌గా పేరు తెచ్చుకున్నారు.
ఆయన అసలు పేరు టెర్రి జీ బొలియా అయిన.. రింగ్ నేమ్ మాత్రం హల్క్ హోగన్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆయన గురువారం గుండె నొప్పితో మరణించారు. 71 సంవత్సరాలు హల్క్ హొగన్.. ఫ్లారిడాలో తుది శ్వాస విడిచారు. దీంతో ఆయన అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు.
రెజ్లింగ్ రింగ్‌లో హల్క్ హొగన్ సృష్టించిన చరిత్రను ఆయన అభిమానులు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. 1953, ఆగస్ట్ 11న అమెరికాలోని జార్జియాలో హల్క్ హొగన్ జన్మించారు. 1977లో ఆయన రెజ్లింగ్ కెరీర్‌ను ప్రారంభించారు. వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్‌లో చేరిన తర్వాత ఆయన ఫేమస్ అయ్యారు. 1980లో రెజ్లింగ్ గ్లామర్‌కు కిక్ ఇచ్చారు. ఇంటర్నేషనల్ రెజ్లర్‌గా తన స్టామినాను చూపించారు.
ఈ వీడియోలను వీక్షించండి..
నా భార్య ఫోన్ ట్యాపింగ్ చేసి..
బెంబేలెత్తిస్తున్న అల్పపీడనం.. 4 రోజులు భారీ వర్షాలు!
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jul 25 , 2025 | 09:56 PM