ఆ బొమ్మల కోసం దేశ ప్రజల పోటీ...

ABN, Publish Date - Jan 23 , 2025 | 12:28 PM

అనకాపల్లి జిల్లా: ఏటికొప్పాక బొమ్మలతో తయారైన శకటం ఢిల్లీ చేరింది. అనకాపల్లి జిల్లా, యలమంచిలి మండలం, ఏటికొప్పాక లక్కబొమ్మలు చాలా ప్రసిద్ధి.. హస్త కళాకారులు తయారు చేసిన కళాకండాలు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతిని ఆర్జించాయి.

అనకాపల్లి జిల్లా: ఏటికొప్పాక బొమ్మలతో తయారైన శకటం ఢిల్లీ చేరింది. రిపబ్లిక్ దినోత్సవానికి ముందే ఈ బొమ్మలను చూసేందుకు భారీగా జనం తరలి వస్తున్నారు. ఏటికొప్పాక కళంకారి హస్తకళా నైపుణ్యం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఏటికొప్పాక లక్క బొమ్మల కోసం దేశ ప్రజలు పోటీ పడుతున్నారు. ఈసారి గణతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఏపీ శకటానికి ఒక ప్రత్యేక ఉందని చెప్పక తప్పదు. గణతంత్య్ర దినోత్సవ పరేడ్‌లో మన శకటానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రతి ఏడాది మన చరిత్రను తెలుగు రాష్ట్రాల గొప్పతనాన్ని చాటేలా శకటాన్ని ప్రదర్శిస్తారు. ఈ ఏడాది అనకాపల్లి జిల్లాకు చెందిన ఏటికొప్పాక బొమ్మలు శకటంగా కనిపించబోతున్నాయి. అందులో ఏముంటాయి.. అసలు తయారు చేసింది ఎవరు... ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.

ఈ వార్త కూడా చదవండి..

నిజాంపేట్‌లో హైడ్రా కొరడా


ఆంధ్రప్రదేశ్‌నలో ఉన్న హస్తకళల్లో అనకాపల్లి జిల్లా, యలమంచిలి మండలం, ఏటికొప్పాక లక్కబొమ్మలు చాలా ప్రసిద్ధి ఆ ప్రాంతంలో లభించే అంకుడు కర్రలతో గ్రామంలోని హస్త కళాకారులు తయారు చేసిన కళాకండాలు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతిని ఆర్జించాయి. ఆ గ్రామంలో 150 సంవత్సరాల క్రితం నుంచి హస్త కళాకండాలు తయారు చేసేవారని ఎవరిని అడిగినా చెబుతారు. పూర్వం మహారాజుల భవనాలలో అలంకరించుకునేందుకు వాటిని తయారు చేయించేవారు. కాలక్రమేణ హస్తకళలను వృత్తిగా మార్చుకుని వంశపారంపర్యంగా అదేపని చేస్తున్నారు. అడవుల్లో అంకుడు కర్రను సేకరించి కొన్ని రోజులపాటు ఆరబెట్టిన తర్వాత కళాఖండాలు తయారు చేసేందుకు ఉపయోగిస్తారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Hydra Effect: నిజాంపేట్‌లో హైడ్రా కొరడా

వైఎస్సార్‌సీపీ కొత్త గేమ్.. రంగంలోకి బాలయ్య..

సైఫ్ అలీ ఖాన్‌కు భారీ భద్రతా

సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక ముందడుగు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jan 23 , 2025 | 01:20 PM