టన్నెల్ లో కనిపించిన ఐదుగురు కార్మికుల మృ*తదేహాలు..!
ABN, Publish Date - Feb 28 , 2025 | 09:21 PM
ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం విషాదంతమైంది. టన్నెల్ లోపల ఐదు మృతదేహాలను గుర్తించారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్‌తో ప్రమాద స్థలిని స్కాన్ చేశారు. దీంతో ఐదుగురు కార్మికులు సజీవ సమాధి అయ్యారు. శుక్రవారం ఉదయం గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్‌తో ప్రమాద స్థలిని స్కాన్ చేశారు.
ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం విషాదంతమైంది. టన్నెల్ లోపల ఐదు మృతదేహాలను గుర్తించారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్‌తో ప్రమాద స్థలిని స్కాన్ చేశారు. దీంతో ఐదుగురు కార్మికులు సజీవ సమాధి అయ్యారు. శుక్రవారం ఉదయం గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్‌తో ప్రమాద స్థలిని స్కాన్ చేశారు. టీబీఎం ముందు భాగంలో దాదాపు 150 మీటర్ల బురదలో ఈ మృతదేహాలు కూరుకుపోయాయి. జీపీఆర్ పద్దతిలో పూర్తిగా స్కాన్ చేశారు. ఇందులో ఐదు మృతదేహాల అనవాళ్లను గుర్తించారు.
10 క్యూబిక్ మీటర్ల బురద ఉంది. దీనిని తొలగించాలంటే పలు వారాలు పడుతోంది. ఇది అసాధ్యమైన పని. ఈ నేపథ్యంలో భూమి లోపల ఇరుక్కుపోయిన అనవాళ్లను ఈ జీపీఆర్ మిషనరీ ద్వారా పరిశీలిస్తారు. దీంతో ఈ ఐదు ప్రదేశాల్లో మట్టిని తవ్వి ఆ మృతదేహాలను బయటకు తీస్తారు. కానీ ఘటనపై అధికారక ప్రకటన మాత్రం చేయలేదు. ఎందుకంటే.. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ సంతోష్ బానోత్ ఈ వార్తలను ఖండించారు. ఎటువంటి అధికారిక సమాచారం లేదని.. ఈ నేపథ్యంలో సమయమనం పాటించాలని ఆయన పేర్కొన్నారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Feb 28 , 2025 | 09:21 PM