ఏం జరిగిందో మాకు తెలియదు..సిగాచి యాజమాన్యం రియాక్షన్

ABN, Publish Date - Jul 02 , 2025 | 10:09 PM

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో భారీ పేలుడు ఘటనపై ఆ సంస్థ ఎండీ అమిత్ రాజ్ సిన్హా స్పందించారు.

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో భారీ పేలుడు ఘటనపై ఆ సంస్థ ఎండీ అమిత్ రాజ్ సిన్హా స్పందించారు. ఈ ఘటన జరగడం చాలా దురదృష్టకరం.. బాధాకరమన్నారు. ఈ ప్రమాదంలో సుమారు 38 మంది మరణించినట్లు తెలుస్తుందని తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో విధుల్లో 143 మంది ఉన్నారని చెప్పారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై త్వరలో నివేదిక వస్తుందన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని.. గాయపడిన వారి చికిత్స ఖర్చు భరిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నామని తెలిపారు. పరిశ్రమలోని పరికరాలు కాలం చెల్లినవి అనడంలో అర్థం లేదన్నారు. భవనం పాతదే అయినా.. పరికరాలు మొత్తం అధునికమైనవేనని చెప్పారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం సహకరించిందని.. అందుకు సీఎం రేవంత్ రెడ్డితోపాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు ఎండీ అమిత్ రాజ్ సిన్హా ధన్యవాదాలు తెలిపారు.

ఈ వీడియోలను వీక్షించండి..

మాకు ఎలాంటి లోటు లేదు.. చంద్రబాబే మా పెద్ద కొడుకు

సిట్ ప్రశ్నలకు చెవిరెడ్డి సైలెంట్.. నోరిప్పితే..!?

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jul 02 , 2025 | 10:09 PM