ఆ పోస్ట్‌లు అందుకే పెట్టా: ఆర్జీవీ

ABN, Publish Date - Feb 07 , 2025 | 06:15 PM

ఒంగోలు రూరల్ పీఎస్‌లో డెరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ విచారణ సుదీర్ఘంగా కొనసాగుతోంది. వైసీపీ తో సంబంధంపై అధికారులు ఆరా తీస్తున్నారు.

ఒంగోలు: వ్యూహం సినిమా ప్రమోషన్‌లో భాగంగా కూటమి నేతల ఫొటోలు మార్ఫింగ్ చేసినట్లు ఆర్జీవీ ఒప్పుకున్నారు. ఒంగోలు రూరల్ పీఎస్‌లో డెరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ విచారణ సుదీర్ఘంగా కొనసాగుతోంది. వైసీపీతో సంబంధంపై అధికారులు ఆరా తీస్తున్నారు. విచారణకు వచ్చే ముందు వైసీపీ కీలక నేత చెవిరెడ్డిని కలవడంపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఫైబర్ నెట్ నుంచి రూ. 2 కోట్ల కేటాయింపుపై అధికారులు ప్రశ్నించగా ఆర్జీవీ నోరు విప్పలేదని వార్తలు వినిపిస్తున్నాయి.

Updated at - Feb 07 , 2025 | 06:15 PM